ఎండలో కూర్చుని విద్యార్థుల భోజనం.. అందుకేనా ?
దిశ, జనగామ: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అన్నిరకాల వసతులతో కూడిన విద్యను అందిస్తున్నదని చెప్పడం వరకే కనబడుతుందని జిల్లాలో ప్రజలు అంటున్నారు. జనగామ జిల్లాలోని చౌడారం మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు కనీస వసతుల కల్పన లేకుండా పోయింది. ప్రభుత్వం మోడల్ స్కూల్స్ ద్వారా విద్యార్థులకు అందిస్తున్న విద్య బాగున్నప్ప టికీ.. వారికి సరైన వసతులు కల్పించడంలో విఫలమైందని తెలుస్తోంది. జిల్లాలోని చౌడారంలో ప్రారంభమైన మోడల్ స్కూల్‌లో ఎంతో మంది విద్యార్థులు విద్యను పొందుతున్నారు. ఈక్రమంలో వారికి నేటికీ […]
దిశ, జనగామ: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అన్నిరకాల వసతులతో కూడిన విద్యను అందిస్తున్నదని చెప్పడం వరకే కనబడుతుందని జిల్లాలో ప్రజలు అంటున్నారు. జనగామ జిల్లాలోని చౌడారం మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు కనీస వసతుల కల్పన లేకుండా పోయింది. ప్రభుత్వం మోడల్ స్కూల్స్ ద్వారా విద్యార్థులకు అందిస్తున్న విద్య బాగున్నప్ప టికీ.. వారికి సరైన వసతులు కల్పించడంలో విఫలమైందని తెలుస్తోంది. జిల్లాలోని చౌడారంలో ప్రారంభమైన మోడల్ స్కూల్‌లో ఎంతో మంది విద్యార్థులు విద్యను పొందుతున్నారు. ఈక్రమంలో వారికి నేటికీ సరైన క్రీడా మైదానం, భోజనం వేళలో భోజనం చేయుటకు సరైన భోజనశాల, షెడ్డు లేకపోవడం గమనార్హం.
విద్యార్థులు భోజనాలు చేసే సమయంలో ఎండలో కూర్చుని భోజనాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం పాఠశాలలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడం వల్లే ఇలా జరుగుతుందని పలువురు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ పాఠశాల జనగామ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పాఠశాలకు వెళ్లేందుకు ఆటోలు ఆర్టీసీ బస్సు మాత్రమే విద్యార్థులకు దిక్కుగా మారింది. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల పై ఆధారపడి ప్రయాణం చేస్తారు.
ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులు సరైన సమయంలో సక్రమంగా రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ నడక మార్గాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అంతే కాకుండా భారీ వర్షాలు వచ్చిన సమయంలో ఈ రోడ్డు మార్గంలోని చీటకోడూరు వాగు దాటి ముందుకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. వాగు వద్ద ఉన్న కల్వర్టుకు ఇరువైపులా ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడం మరీ దారుణం అని స్థానిక ప్రజలు అంటున్నారు. పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్స్, సూచిక బోర్డులు కూడా లేకపోవడం మరీ దారుణమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా పాలకులు పాఠశాల అభివృద్ధి పై దృష్టి సారించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.