స్వామి ఎక్కడున్నాడు..? టెన్షన్‌లో కుటుంబ సభ్యులు
దిశ, కామారెడ్డి : అతను నమ్మిన సిద్ధాంతం కోసం అడవి బాట పట్టాడు. పేద ప్రజల పక్షాన దాదాపుగా 30 ఏండ్లుగా పోరాడుతూ అజ్ఞాతంలో ఉంటున్న ఆ వ్యక్తి.. కామారెడ్డి జిల్లా ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన ‘లోకేటి చందర్ అలియాస్ స్వామి అలియాస్ రవి’ మహారాష్ట్ర రాష్ట్రంలో గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అడవుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో మృతి చెందినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ‘స్వామి’ ఎన్ కౌంటర్‌లో తప్పించుకున్నాడా? లేక మృతి చెందాడా […]
దిశ, కామారెడ్డి : అతను నమ్మిన సిద్ధాంతం కోసం అడవి బాట పట్టాడు. పేద ప్రజల పక్షాన దాదాపుగా 30 ఏండ్లుగా పోరాడుతూ అజ్ఞాతంలో ఉంటున్న ఆ వ్యక్తి.. కామారెడ్డి జిల్లా ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన ‘లోకేటి చందర్ అలియాస్ స్వామి అలియాస్ రవి’ మహారాష్ట్ర రాష్ట్రంలో గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అడవుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో మృతి చెందినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ‘స్వామి’ ఎన్ కౌంటర్‌లో తప్పించుకున్నాడా? లేక మృతి చెందాడా తెలియక ప్రజలు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
స్వామి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అప్పటి పీపుల్స్ వార్‌లో అంచెలంచెలుగా కీలక నేతగా ఎదిగి అనేక ఎన్ కౌంటర్‌లలో తప్పించుకున్న ఘటనలను నిజామాబాద్ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. అనేక ఎన్ కౌంటర్‌లలో తప్పించుకుంటూ దళ కమాండర్, డీసీఎం, జిల్లా కార్యదర్శి, అనంతరం దండకారణ్యం కంపెనీ సారధి వరకు అతని ప్రస్థానం కొనసాగింది. నిజామాబాద్ జిల్లాలో అనేక ఎన్ కౌంటర్లు జరిగాయి.
పడకల్ గ్రామంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో ఒకే ఒక్కడు తప్పించుకోవడంతో ఒక్కసారిగా స్వామి పేరు మారుమ్రోగింది.అలాంటిది స్వామి మృతిచెందాడా లేదా అనే విషయాన్ని పోలీసులు లేదా మావోయిస్టులు ప్రకటించాలి. కానీ, ఇంతవరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఒకవేళ స్వామి ఎన్ కౌంటర్లో చనిపోతే జిల్లాలో ఉన్న ఒకే ఒక్క మావోయిస్టు నేత కనుమరుగైనట్లేనని ప్రజలు చర్చించుకుంటున్నారు.