కరోనా ఎఫెక్ట్.. ఈసారి చేప మందు లేదు

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో చేప మందు ప్రసాదం పంపిణీని నిలిపేశారు. ఈ మేరకు బత్తిని హరినాథ్ గౌడ్ ఆదివారం స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజున బత్తిని బ్రదర్స్ ఉచితంగా చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా ఎప్పుడు నయమవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో చేప మందు పంపిణీని నిలిపివేస్తున్నట్టు […]

Update: 2020-05-10 10:57 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో చేప మందు ప్రసాదం పంపిణీని నిలిపేశారు. ఈ మేరకు బత్తిని హరినాథ్ గౌడ్ ఆదివారం స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజున బత్తిని బ్రదర్స్ ఉచితంగా చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా ఎప్పుడు నయమవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో చేప మందు పంపిణీని నిలిపివేస్తున్నట్టు హరినాథ్ గౌడ్ ప్రకటించారు. చేపమందు కోసం నగరానికి ఎవరూ రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ చేప మందు పంపిణీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. తాము చేప మందు పంపిణీ చేస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసినా నమ్మొద్దని ప్రజలను కోరారు.

Tags:    

Similar News