ఎంపీ అర్వింద్ ఆశలు గల్లంతు.. ఈసారి కూడా దక్కని ఛాన్స్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ కేంద్రమంత్రి పదవి ఆశలు గల్లంతయ్యాయి. బుధవారం కేంద్రమంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని ఆశించిన అర్వింద్ ఆశలు అడియాశలు అయ్యాయి. తెలంగాణకు చెందిన గంగాపూరం కిషన్ రెడ్డికి తప్ప మరేవ్వరికి అవకాశం కల్పించలేదు. దానితో మొదటి విడతలో తనకు దక్కకుండా పోయిన మంత్రి పదవి రెండవ విడత విస్తరణలో ఖచ్చితంగా దక్కుతుందనుకున్న అర్వింద్ ఆశలు గల్లంతయ్యాయి. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో సీఎం కేసిఆర్ […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ కేంద్రమంత్రి పదవి ఆశలు గల్లంతయ్యాయి. బుధవారం కేంద్రమంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని ఆశించిన అర్వింద్ ఆశలు అడియాశలు అయ్యాయి. తెలంగాణకు చెందిన గంగాపూరం కిషన్ రెడ్డికి తప్ప మరేవ్వరికి అవకాశం కల్పించలేదు. దానితో మొదటి విడతలో తనకు దక్కకుండా పోయిన మంత్రి పదవి రెండవ విడత విస్తరణలో ఖచ్చితంగా దక్కుతుందనుకున్న అర్వింద్ ఆశలు గల్లంతయ్యాయి. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో సీఎం కేసిఆర్ తనయ కల్వకుంట్ల కవితను ఓడించి కొత్త రికార్డులను నెలకొల్పిన అర్వింద్ మొదటి నుంచి కేంద్రలో ఎదైన మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. తనకు కేంద్రమంత్రులతో ఉన్న పరిచయాలకు తోడు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ అన్న ఇమేజ్ కుడా కలిసి వస్తుందని మంత్రి పదవిపై ఎన్నో కలలు కన్నారు.
గడిచిన మున్సిపల్ ఎన్నికలలో నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో 29 మందిని గెలిపించి బల్ధియాలో అతిపెద్ధ పార్టీగా విజయం సాధించడంలో అర్వింద్ కు ప్రధాన పాత్ర ఉంది. దానికితోడు హైదరాబాద్ బల్ధియా ఎన్నికలలో ప్రచారం చేయడంలో పార్టీలోనూ ఎంపీ గురి పెరిగింది. రాష్ట్రంలో ఎక్కడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులను విమర్శించడంలో ముందుండే అర్వింద్ కు బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుంది. దానికి తోడు చాలామంది లీడర్ లను పార్టీలో చేర్పించడంలో నిజామాబాద్ జిల్లాతో పాటు బీజేపీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించి పెట్టుకున్నారు. తెలంగాణలో నలుగురు పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తుండగా కిషన్ రెడ్డి ఇది వరకు కేంద్రమంత్రి వర్గంలో ఉండటం, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటంతో ఈసారి క్యాబినేట్ విస్తరణలో తనకు ఖచ్చితంగా అవకాశం వస్తుందని ఎంపి అర్వింద్ భావించారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పుంజుకోవాలంటే యువతకు మంత్రి వర్గ విస్తరణలో అవకాశం ఉండటంతో యువకుడైన అరవింద్ మంత్రి పదవి రావడం అనేది గ్యారంటి అనే అందరు అనుకున్నారు.
రెండవ విడత మంత్రి వర్గ విస్తరణపై గంపెడాశలు పెట్టుకున్న ధర్మపూరి అర్వింద్ దానికోసం ఇటీవల తీవ్ర కసరత్తు చేశారు. మంత్రి వర్గ విస్తరణ గురించి ముందుగానే తెలిసి డిల్లీలో మకాం వేశారు. అక్కడ తన గురువుగా భావించే కేంద్రమంత్రితో పలు ధపాలుగా చర్చలు జరిపారు. గడిచిన రెండు నెలలుగా తన అనుచరుల వద్ధ కేంద్రంలో మంత్రి కావడం ఖాయమని చెప్పుకోచ్చారు కుడా. కేవలం పోర్టు పోలియోనే మిగిలింది తనకు కేంద్ర క్యాబినేట్ లో పిలుపు రావడమే తరువాయి అన్నచంధంగా పెద్ధ ఎత్తున ప్రచారం కుడా జరిగింది. 2024 ఎన్నికలకు ముందు తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకుపోయేందుకు, అందునా దక్షిణాదిలో కాస్తో కూస్తో బలంగా ఉన్న తెలంగాణలో మంత్రి వర్గంలో కొత్తవారికి అవకాశం ఇస్తే పార్టీ బలపడుతుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తుందని ఆ కోణంలో తనకు మంత్రి పదవి రావడం అనేది లాంఛనమే అని ఎంపి అర్వింద్ భావించారు కుడా. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో మకాం వేసిన అర్వింద్ ఆశలకు బుధవారం జరిగిన క్యాబినేట్ విస్తరణలో క్యాబినేట్ కాకున్న సహయ మంత్రి పదవి వస్తుందనుకున్నా.. అందులో కుడా తన పేరు లేకపోవడం తీవ్ర నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు.
కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకుని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో తన ప్రభావంను సెట్ చేసుకుందామనుకున్న ఎంపీ ఆశలకు గండిపడింది. ఏ సమీకరణల కారణంగా అర్వింద్ కు మంత్రి పదవి దక్కలేదు అనే విషయం ఇప్పటీకి బహిర్గతం కాకున్న బీజేపీలో మాత్రం మంత్రి పదవి మిస్ అయిన విషయం జోరుగా చర్చ జరుగుతుంది. అర్వింద్ కు మంత్రి పదవి రెండవ విస్తరణలో ఖాయం అని జిల్లా నేతలు సంబరాలకు సిద్ధమైన, విస్తరణలో ఆయన పేరు లేకపోవడంతో బీజేపీ నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఏర్పాట్లలో నిమగ్నం కాగా, అర్వింద్ 13న జరిగే దిశ మీటింగ్ కు వస్తారా లేదా అనే వాదనలు ఉన్నాయి. అయితే అర్వింద్ కు మంత్రి పదవి రాకపోవడంతో జిల్లాలో ఒకవర్గం నేతలు మాత్రం ఖుషిగా ఉన్నారు. బీజేపీలో కిషన్ రెడ్డి వర్గంగా ఉన్న నేతలు అర్వింద్ దూకుడుకు కళ్లెం పడినట్లే అని చెబుతున్నారు.