బోర్ అంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తించొద్దు : నివేద

నివేద థామస్.. తన అభినయంతోనే గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ క్యూట్ హీరోయిన్. తెలుగు, తమిళ్‌లో ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ కెరియర్లో ముందుకు సాగుతోంది. దర్బార్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురిగా నటించి ప్రేక్షకులతో కన్నీరు పెట్టించిన నివేద.. తెలుగులో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘వి’ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంది. అయితే కరోనా విపత్కర పరిస్థితులు ఇంకా తొలగిపోలేదని.. ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుతోంది నివేద. ‘ఒకానొకప్పుడు కొవిడ్ -19 వ్యాపిస్తోంది ఇంట్లోనే […]

Update: 2020-06-13 07:04 GMT

నివేద థామస్.. తన అభినయంతోనే గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ క్యూట్ హీరోయిన్. తెలుగు, తమిళ్‌లో ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ కెరియర్లో ముందుకు సాగుతోంది. దర్బార్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురిగా నటించి ప్రేక్షకులతో కన్నీరు పెట్టించిన నివేద.. తెలుగులో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘వి’ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంది.

అయితే కరోనా విపత్కర పరిస్థితులు ఇంకా తొలగిపోలేదని.. ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుతోంది నివేద. ‘ఒకానొకప్పుడు కొవిడ్ -19 వ్యాపిస్తోంది ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పుడు మనం 2020 మధ్యలో ఉన్నాం.. అయినా కూడా మనం ఇంట్లో ఉంటేనే బెటర్’ అంటోంది.

‘నాకు తెలుసు.. మనలో చాలా మంది ఇంట్లో ఉండటాన్ని బోర్‌గా ఫీల్ అవుతారు.. కానీ ఆ ఫీలింగ్‌తో నిర్లక్ష్యంగా ప్రవర్తించొద్దని’ విజ్ఞప్తి చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని.. ఆ సమయంలోనూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరింది. ‘కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మరో దారి లేదు. ముప్పు ఆసన్నమైంది. కాబట్టి పరిస్థితిని లైట్ తీసుకోకుండా ప్రతీ ఒక్కరం జాగ్రత్తగా ఉందామని కోరింది నివేద.

Tags:    

Similar News

Ishita Raj Sharma