క్రేజీ చాన్స్ … పవన్ జోడీగా నివేద పేతురాజ్?

నివేద పేతురాజ్… తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మధ్య చిత్రలహరి, అల వైకుంఠపురం లో సినిమాలో కనిపించి మంచి మార్కులు కొట్టేసిన ఈ భామ… తాజాగా మరో మెగా ప్రాజెక్ట్ కు సెలెక్ట్ అయిందట. క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న చిత్రంలో సెకండ్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ చేయబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. క్రిష్ నివేదను ఆల్రెడీ కన్ ఫాం చేసినట్లు సమాచారం కాగా… అధికారిక ప్రకటన […]

Update: 2020-04-24 04:14 GMT
క్రేజీ చాన్స్ … పవన్ జోడీగా నివేద పేతురాజ్?
  • whatsapp icon

నివేద పేతురాజ్… తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మధ్య చిత్రలహరి, అల వైకుంఠపురం లో సినిమాలో కనిపించి మంచి మార్కులు కొట్టేసిన ఈ భామ… తాజాగా మరో మెగా ప్రాజెక్ట్ కు సెలెక్ట్ అయిందట. క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న చిత్రంలో సెకండ్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ చేయబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. క్రిష్ నివేదను ఆల్రెడీ కన్ ఫాం చేసినట్లు సమాచారం కాగా… అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా క్రిష్ పవన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పవన్ కెరీర్ లో తొలి పీరియాడికల్ మూవీ కానుంది. తెలంగాణ నేపథ్యంలో సాగే కథలో బందిపోటుగా కనిపించనున్నారు అని సమాచారం. కాగా ఈ చిత్రంలో ఫస్ట్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సెలెక్ట్ అయిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ పాత్ర కీర్తి సురేష్ నటించనున్నట్లు తెలిసింది. కానీ దీనిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కాగా ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Tags: Nivetha pethuraj, Pawan Kalyan, Trisha, MM Keeravani, Keerthi suresh, Jacqueline Fernandez

Tags:    

Similar News