గ్రేటర్ ప్రచారంపై తుఫాన్ ఎఫెక్ట్
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గ్రేటర్ ప్రచారంపై నివర్ తుఫాన్ నీళ్లుచల్లింది. అభ్యర్థుల ప్రచారానికి అడ్డంకిగా మారింది. అసలే సమయం తక్కువగా ఉందని మదనపడుతుండ గా తుఫాన్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికల ప్రచారం ముగింపు, పోలింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్ది అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఎన్నికల తంతు ముగించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ వంటి ప్రధాన ఎన్నికల ఘట్టాలను […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గ్రేటర్ ప్రచారంపై నివర్ తుఫాన్ నీళ్లుచల్లింది. అభ్యర్థుల ప్రచారానికి అడ్డంకిగా మారింది. అసలే సమయం తక్కువగా ఉందని మదనపడుతుండ గా తుఫాన్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికల ప్రచారం ముగింపు, పోలింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్ది అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఎన్నికల తంతు ముగించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.
నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ వంటి ప్రధాన ఎన్నికల ఘట్టాలను అభ్య ర్థులు ఉరుకులు పరుగులతోనే పూర్తి చేశారు. టీఆర్ఎస్ ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటికీ కొన్ని డివిజన్లలో ప్రకటించిన అభ్యర్థులను మార్చే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. మరోవైపు బీజేపీ అభ్యర్థుల ప్రకటనలో నెలకొన్న జాప్యం బీ ఫారాలు ఇచ్చేంత వరకు కొనసాగింది. దీంతో డివిజన్లలో అభ్యర్థులు ఎన్నికల కార్యాలయాలు తెరవడం, ప్రచార సామ గ్రి సమకూర్చుకోవడం వంటి అంశాలతో సమ యం గడిచి పోయింది. తీరా అన్ని కుదురుకుని ప్రచారం మొదలు పెడతామనే సరికి తుఫాన్, ముసురు అభ్యర్థల ఆశలపై నీల్లుజల్లింది.
తగ్గిన కార్యకర్తలు..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచా రంలో పాల్గొనేందుకు తుఫాన్ ప్రభావం మొదలుకాక ముందు వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బస్తీలు, కాలనీల్లో పర్యటించారు. చలి తీవ్రత పెరిగిపోయిన నేపథ్యంలో సగం మంది కార్యకర్తలు కూడా ప్రచారంలో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదు. చలిలో కరోనా వేగం గా వ్యాప్తి చెందుతుందని ప్రచారం విస్తృతంగా జరగడంతో వెనకడుగు వేయడానికి కారణంగా కనబడుతోంది.
వెనక్కు తగ్గని అభ్యర్థులు..
జీహెచ్ఎంసీ ఎన్నికలకు కేవలం రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో చలి, కరోనా ప్రభావం చూపినా, కార్యకర్తలు కలిసి రాకున్నా ఉన్న వనరులతో అభ్యర్థులు ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. రాత్రి వరకు బస్తీలు, కాలనీల్లోనే అధిక సమయం వెచ్చిస్తున్నారు. తిండి, నిద్ర మానేసి గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. అర్ధరాత్రి వరకు కూడా ముఖ్యనేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి సమాలోచనలు చేస్తున్నా రు. మొత్తం మీద ఎన్నికలకు గడువు చాలా తక్కువ ఉండడం, ఇందులోనే తుఫాన్ ప్రభావం చూపుతున్నప్పటికీ అభ్య ర్థులు వెరవకుండా ముందు కు సాగుతున్నారు.