పోలీసులు జవాబుదారీగా ఉండాలి : ఎస్పీ

దిశ, నిర్మల్: పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో పాల్గొని జిల్లాలోని ఆయా మండలాల నుంచి వచ్చిన ఆర్జీ దారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. ప్రజలు సమస్యలతో పోలీసు స్టేషన్ వచ్చినప్పుడు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చేసినప్పుడే పోలీసులపై నమ్మకం కలుగుతుందని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉండటంతో […]

Update: 2020-06-22 06:32 GMT
పోలీసులు జవాబుదారీగా ఉండాలి : ఎస్పీ
  • whatsapp icon

దిశ, నిర్మల్: పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో పాల్గొని జిల్లాలోని ఆయా మండలాల నుంచి వచ్చిన ఆర్జీ దారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. ప్రజలు సమస్యలతో పోలీసు స్టేషన్ వచ్చినప్పుడు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చేసినప్పుడే పోలీసులపై నమ్మకం కలుగుతుందని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉండటంతో అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడాలన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకారం అందించాలని, అనుమాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి, లేదా జిల్లా వాట్సప్ నెం.8333986939కు సమాచారం తెలియజేయాలని కోరారు. పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలకు సేవ చేయడంలో నిర్మల్ పోలీసులు ముందుంటారని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News