‘ఎవ్వరినీ ఉపేక్షించొద్దు’
దిశ, ఆదిలాబాద్: కరోనా నియంత్రణకు లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలనీ, ఇందులో భాగంగా నిబంధనలు ఉల్లంఘించినవారెవ్వరినీ ఉపేక్షించొద్దని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పోలీసులను ఆదేశించారు. జిల్లా పోలీస్ స్టేషన్ల్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పాయింట్ల వద్ద మరింత పకడ్బందీగా తనీఖీలు చేయాలని తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై కేసు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు, […]
దిశ, ఆదిలాబాద్: కరోనా నియంత్రణకు లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలనీ, ఇందులో భాగంగా నిబంధనలు ఉల్లంఘించినవారెవ్వరినీ ఉపేక్షించొద్దని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పోలీసులను ఆదేశించారు. జిల్లా పోలీస్ స్టేషన్ల్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పాయింట్ల వద్ద మరింత పకడ్బందీగా తనీఖీలు చేయాలని తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై కేసు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు చేరవేసే వాహనాలకు ఆటంకం కలిగించకూడదన్నారు. వ్యవసాయ ఆధారిత సేవలకు ఆటంకం కలిగించకుండా, రైతులు సామాజిక దూరం పాటించేలా చూడాలన్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారు మనోవేదనకు గురికాకుండా, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని సూచించారు. అనంతరం స్టేషన్‌లోని సిబ్బందికి శానిటైజర్స్, మాస్కులు, గ్లౌజ్‌లు అందజేశారు.