‘‘అందరికీ కనిపించాలి’’
ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలలో పరదాలు వేసుకుని పని చేయడం ఏమిటి..? అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై కచ్చితంగా పారదర్శకతను పాటించాల్సిందే. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై పరదాలు లేని పాలన సాధిద్దామని నిర్మల్ జిల్లా కొత్త కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుక్ సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అది ముందుగా తన కార్యాలయంతోనే ప్రారంభించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్‌తో పాటు, జాయింట్ […]
ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలలో పరదాలు వేసుకుని పని చేయడం ఏమిటి..? అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై కచ్చితంగా పారదర్శకతను పాటించాల్సిందే. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై పరదాలు లేని పాలన సాధిద్దామని నిర్మల్ జిల్లా కొత్త కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుక్ సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అది ముందుగా తన కార్యాలయంతోనే ప్రారంభించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్‌తో పాటు, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి… ఇతర పర్యవేక్షణ సిబ్బంది గదులకు సంబంధించిన పరదాలు అన్నింటిని తొలగించారు. కిటికీలకు ఉన్న విండో కర్టెన్లు కూడా తీసేయించారు. కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజలకు అక్కడ పనిచేసే అధికారులు ఉద్యోగులు అందరూ కనిపించేలా పాలన సాగాలని ఆదేశించారు.
విశాలమైన కార్యాలయం, చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి ఉన్న కలెక్టర్ కార్యాలయంలో ఏసీల అవసరం ఏముంది అంటూ కలెక్టర్ ముషారఫ్ అలీ ముందుగా తన ఛాంబర్లో ఏసీ వాడకాన్ని నిలిపేశారు. సామాన్య ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగానే కలెక్టర్ కార్యాలయం ఒకటని కొత్త కలెక్టర్ తీసుకున్న నిర్ణయం అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆలోచింపజేస్తుంది.
ప్రభుత్వ శాఖల్లో పని లేకుండా ఉన్న ఉన్నతాధికారుల జాబితాను నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ సిద్ధం చేసుకున్నారని సమాచారం. అనేక కీలకమైన ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు కొరత ఉన్నందున అలాంటి చోట్లకు… పని లేకుండా ఉన్న జిల్లాస్థాయి అధికారులను పంపాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు వస్తున్న నేపథ్యంలో… జిల్లా, మండల పరిషత్ కార్యాలయాలలో అధికారులకు ప్రస్తుతం పని భారం లేదని కలెక్టర్ దృష్టికి వచ్చినట్టు చెబుతున్నారు. వెంటనే జెడ్పీ సీఈవో సుధీర్‌ని పిలిపించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నా మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ వంటి కార్యక్రమాల అమలుకు నోడల్ అధికారిగా నియమిస్తున్నట్టు ఆదేశించారు. ఈ నిర్ణయం జిల్లా అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
కలెక్టరు కార్యాలయానికి వచ్చేవాళ్లు ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేందుకు వీలు లేదు. సామాన్యులు మొదలుకొని ఎవరైనా సరే కలెక్టరేట్‌కు సాయంత్రం 4 గంటల తర్వాతనే రావాలని హుకుం జారీ చేశారు. ఇందులో ధనిక పేద తేడా లేదని స్పష్టం చేశారు. ప్రతిరోజు నాలుగు నుంచి 5గంటల నడుమ ప్రజల కోసం సమయం ఇచ్చి తనని కలెక్టర్ ప్రకటించారు. ఈ నిర్ణయం కూడా అన్ని వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. కొత్త కలెక్టర్ అమలు చేస్తున్న సంస్కరణలు అన్ని వర్గాలను ఆలోచింప జేస్తున్నాయి.