నిర్భయ కేసులో మరో ట్విస్ట్
నిర్భయ దోషుల్లో ఒకరైనా ముకేశ్ సింగ్ మరోసారి సుప్రీం తలుపు తట్టాడు. అయితే, ఈసారి తన లాయర్లు తప్పుదారి పట్టించారని, చట్టపరంగా తనకుండే అవకాశాలను మరోసారి వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ముకేశ్ తరపున ఎంఎల్ శర్మ అనే న్యాయవాది క్యురేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన విషయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీ సర్కారు, అమికస్ క్యూరీగా వ్యవహరించిన వ్రిందా గ్రోవర్‌లు నేరపూరిత కుట్రకు పాల్పడి తనను మోసం చేశారని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషన్‌లో […]
నిర్భయ దోషుల్లో ఒకరైనా ముకేశ్ సింగ్ మరోసారి సుప్రీం తలుపు తట్టాడు. అయితే, ఈసారి తన లాయర్లు తప్పుదారి పట్టించారని, చట్టపరంగా తనకుండే అవకాశాలను మరోసారి వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ముకేశ్ తరపున ఎంఎల్ శర్మ అనే న్యాయవాది క్యురేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన విషయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీ సర్కారు, అమికస్ క్యూరీగా వ్యవహరించిన వ్రిందా గ్రోవర్‌లు నేరపూరిత కుట్రకు పాల్పడి తనను మోసం చేశారని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషన్‌లో కోరాడు. సోమవారం ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Tags: nirbhaya case, mukesh singh, supreme court