ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నైట్ కర్ఫ్యూను ఈనెల 30 వరకు పొడిగిస్తున్నట్లు జీవోలో తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జనసమూహాలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడం..భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. రాష్ట్రంలో కొవిడ్‌ […]

Update: 2021-07-21 08:17 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నైట్ కర్ఫ్యూను ఈనెల 30 వరకు పొడిగిస్తున్నట్లు జీవోలో తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జనసమూహాలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడం..భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు, తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News