సీఎం కీలక నిర్ణయం.. రాత్రి 9 నుండి కర్ఫ్యూ..

దిశ , వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మరో కీలక ప్రకటన చేశారు. ఈరోజు నుంచి రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో.. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపారు. లూథియానా, జలంధర్, పాటియాలా, మొహాలీ, అమృత్‌సర్, గురుదాస్‌పూర్, హోషియార్‌పూర్, కపుర్తలా, రోపార్ జిల్లాలో ప్రతీరోజు 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ఈ […]

Update: 2021-03-18 05:05 GMT

దిశ , వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మరో కీలక ప్రకటన చేశారు. ఈరోజు నుంచి రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో.. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపారు. లూథియానా, జలంధర్, పాటియాలా, మొహాలీ, అమృత్‌సర్, గురుదాస్‌పూర్, హోషియార్‌పూర్, కపుర్తలా, రోపార్ జిల్లాలో ప్రతీరోజు 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

అయితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం రాత్రి 11 నుండి ఉదయం 5 గంటలకు వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పబ్లిక్ గ్యాదరింగ్స్‌పై నిషేధం విధించినట్టు తెలిపారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.

 

Tags:    

Similar News