Nidhhi Agerwal: వెబ్‌సైట్‌లో ప్రేమ పంచనున్న నిధి..

దిశ, సినిమా : ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. కొవిడ్ 19 క్లిష్ట పరిస్థితుల్లో బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కొవిడ్ సంబంధిత అవసరాలన్నీ ఒకే చోట నెరవేరేలా ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో వెబ్‌సైట్‌ను లాంచ్ చేయబోతోంది. దీని ద్వారా వచ్చే ప్రతీ రిక్వెస్ట్‌ను తీర్చేందుకు ఒక టీమ్‌ను ఫామ్ చేస్తున్నానని చెప్పిన నిధి.. అందుకు సంబంధించిన పూర్తి విషయాలను వెల్లడించింది. ‘డిస్ట్రిబ్యూట్ లవ్ పేరుతో కొత్తగా చారిటబుల్ సంస్థను ఏర్పాటు చేస్తున్నా. […]

Update: 2021-05-26 06:52 GMT

దిశ, సినిమా : ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. కొవిడ్ 19 క్లిష్ట పరిస్థితుల్లో బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కొవిడ్ సంబంధిత అవసరాలన్నీ ఒకే చోట నెరవేరేలా ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో వెబ్‌సైట్‌ను లాంచ్ చేయబోతోంది. దీని ద్వారా వచ్చే ప్రతీ రిక్వెస్ట్‌ను తీర్చేందుకు ఒక టీమ్‌ను ఫామ్ చేస్తున్నానని చెప్పిన నిధి.. అందుకు సంబంధించిన పూర్తి విషయాలను వెల్లడించింది. ‘డిస్ట్రిబ్యూట్ లవ్ పేరుతో కొత్తగా చారిటబుల్ సంస్థను ఏర్పాటు చేస్తున్నా. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఎవరు రిక్వెస్ట్ పంపినా.. ప్రాథమిక అవసరాలు, మెడికేషన్ లేదా ఇతరత్రా కావలసిన వస్తువులను సాధ్యమైన రీతిలో తీరుస్తాం’ అని తెలిపింది.

ప్రత్యేకించి కొవిడ్ సంబంధిత అవసరాలకే ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన నిధి.. అన్ని వనరులు సమకూర్చుకున్నాక ప్రజల నుంచి రిక్వెస్ట్‌లు తీసుకోవడంపై ద‌ృష్టిపెడతామని వివరించింది. ఇక 2017లో ‘మున్నా మైకేల్’ మూవీ ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది.

Tags:    

Similar News