మళ్ళీ రెండంకెలకు పెరిగిన కరోనా కేసులు

• జీహెచ్ఎంసీలో 30, వలస కూలీకి పాజిటివ్ దిశ, న్యూస్‌బ్యూరో : రాష్ట్రంలోని ఆరెంజ్, గ్రీన్ జోన్లలో పరిస్థితి ఎలా ఉన్నా.. రెడ్ జోన్‌లో ఉన్న హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) పరిస్థితి మాత్రం గందరగోళంగానే ఉంది. సింగిల్ డిజిట్‌లో కేసులు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం సంబరపడుతున్న సమయంలోనే మళ్ళీ రెండంకెల స్థాయిలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్తగా 30 కేసులు బయటపడ్డాయి. ఓ వలస కూలీకి కూడా పాజిటివ్ […]

Update: 2020-05-09 11:11 GMT

• జీహెచ్ఎంసీలో 30, వలస కూలీకి పాజిటివ్

దిశ, న్యూస్‌బ్యూరో :

రాష్ట్రంలోని ఆరెంజ్, గ్రీన్ జోన్లలో పరిస్థితి ఎలా ఉన్నా.. రెడ్ జోన్‌లో ఉన్న హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) పరిస్థితి మాత్రం గందరగోళంగానే ఉంది. సింగిల్ డిజిట్‌లో కేసులు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం సంబరపడుతున్న సమయంలోనే మళ్ళీ రెండంకెల స్థాయిలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్తగా 30 కేసులు బయటపడ్డాయి. ఓ వలస కూలీకి కూడా పాజిటివ్ రావడంతో మొత్తం 31 కొత్త కేసులు నమోదైనట్లయింది. నగరంలో శనివారం వెలుగుచూసిన కొత్త కేసుల్లో ఎక్కువగా బోరబండ, గోల్కొండ పరిధిలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అంబర్‌పేట, వనస్థలిపురం, కింగ్ కోఠి ప్రాంతాల్లో నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వనస్థలిపురంలో ఇంకా పదుల సంఖ్యలో అనుమానిత కేసులు ఉన్నాయని, వాటి పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉందని, అవి కూడా వస్తే సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ముంబయి నుంచి వచ్చిన వలస కూలీల్లో ముగ్గురికి నాలుగైదు రోజుల క్రితం పాజిటివ్ రాగా ఇప్పుడు మరొకరికి వచ్చింది. అయితే ఆ వివరాలను వైద్యారోగ్య శాఖ వెల్లడించలేదు.

కొత్తగా నమోదైన 31 కేసులతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1163కు చేరుకుంది. ఇప్పటిదాకా 29 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోతే శనివారం మరొకరు చనిపోయారు. చికిత్స అనంతరం శనివారం 24 మంది డిశ్చార్జి కావడంతో కోలుకున్నవారి సంఖ్య 751కు చేరుకుంది. ఇంకా 382 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News