కివీస్‌దే రెండో టెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్.. భారత్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కివీస్ వైట్‌వాష్ చేసింది. 132 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు లాథమ్ (52, 10ఫోర్లు), బ్లండెల్ (55, 8ఫోర్లు, ఓ సిక్సర్) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం లాథమ్‌ను ఉమేశ్ ఔట్ చేయగా, అనంతరం వచ్చిన విలియమ్సన్ (5) బుమ్రా బౌలింగ్‌లో రహనే […]

Update: 2020-03-01 21:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్.. భారత్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కివీస్ వైట్‌వాష్ చేసింది. 132 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు లాథమ్ (52, 10ఫోర్లు), బ్లండెల్ (55, 8ఫోర్లు, ఓ సిక్సర్) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం లాథమ్‌ను ఉమేశ్ ఔట్ చేయగా, అనంతరం వచ్చిన విలియమ్సన్ (5) బుమ్రా బౌలింగ్‌లో రహనే చేతికి చిక్కాడు. అదే ఓవర్లోనే బ్లండెన్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాస్ టేలర్, నికోల్స్ మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. ఇక భారత బౌలర్లు బుమ్రా రెండు, ఉమేశ్ ఒక వికెట్ తీశాడు.
టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తొలిసారి పాయింట్లను కోల్పోయింది.

Tags:    

Similar News