కొత్త రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శం..!
దిశప్రతినిధి, ఆదిలాబాద్: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతగా, ఆ చట్టానికి సంఘీభావంగా శనివారం నిర్మల్ నియోజకవర్గంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కనకాపూర్ నుంచి లక్ష్మణచాంద వరకు ట్రాక్టర్ నడుపుతూ మంత్రి అల్లోల పాల్గొన్నారు. ఈ ర్యాలీకి రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల […]
దిశప్రతినిధి, ఆదిలాబాద్: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతగా, ఆ చట్టానికి సంఘీభావంగా శనివారం నిర్మల్ నియోజకవర్గంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కనకాపూర్ నుంచి లక్ష్మణచాంద వరకు ట్రాక్టర్ నడుపుతూ మంత్రి అల్లోల పాల్గొన్నారు. ఈ ర్యాలీకి రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో పాటు రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి అన్నదాత బాధలను తీర్చిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. వీఆర్వోల చుట్టూ రైతులు రోజుల తరబడి తిరిగినా భూసమస్యలు పరిష్కారం కాలేదన్నారు. భూ సమస్యలు, పాస్‌పుస్తకాల కోసం నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే రైతులకు ఎంతో ఊరట లభిస్తుందని వెల్లడించారు.