అమెజాన్‌కు ఆ పేరుతో కొత్త చిక్కులు!

దిశ, ఫీచర్స్: అమెజాన్‌.. తన వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఇళ్లల్లోని అమెజాన్ ఎకో, ఎకో డాట్ స్పీకర్లకు వాయిస్ కమాండ్ ఇచ్చేందుకు ‘అలెక్సా’ పదాన్ని ఉపయోగించడం కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు అదే పేరు ఈ-కామర్స్ దిగ్గజానికి చిక్కులు తెచ్చిపెట్టింది. అలెక్సా పేరున్న వ్యక్తులపై జోక్స్‌ వేయడంతో పాటు హేళన చేయడం వల్ల నలుగురిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హే గూగుల్.. అన్నం తిన్నావా? హలో గూగుల్.. ఐ […]

Update: 2021-07-09 06:33 GMT

దిశ, ఫీచర్స్: అమెజాన్‌.. తన వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఇళ్లల్లోని అమెజాన్ ఎకో, ఎకో డాట్ స్పీకర్లకు వాయిస్ కమాండ్ ఇచ్చేందుకు ‘అలెక్సా’ పదాన్ని ఉపయోగించడం కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు అదే పేరు ఈ-కామర్స్ దిగ్గజానికి చిక్కులు తెచ్చిపెట్టింది. అలెక్సా పేరున్న వ్యక్తులపై జోక్స్‌ వేయడంతో పాటు హేళన చేయడం వల్ల నలుగురిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హే గూగుల్.. అన్నం తిన్నావా? హలో గూగుల్.. ఐ లవ్ యూ! అంటూ చాలామంది కుర్రాళ్లు గూగుల్ వాయిస్ కమాండ్‌‌‌‌ను ప్రశ్నిస్తూ టైమ్‌పాస్ చేయడం చూస్తుంటాం. ‘సిరి’ విషయంలో యాపిల్ వినియోగదారులు సైతం ఇదే పంథాను అవలంబిస్తుంటారు. కానీ అమెజాన్ ‘అలెక్సా’ విషయంలోనే ఆ పేరు విపరీతంగా పాపులర్ కావడం వల్ల సదరు పేరున్న వ్యక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్కూల్, కాలేజీ, వర్క్ ప్లేస్‌లలో ఆ పేరున్న వ్యక్తులకు కమాండ్ ఇస్తూ ఆటపట్టిస్తుండటంతో మనస్తాపానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది తమ పేరు చెప్పుకునేందుకే ఇబ్బంది పడుతుండగా.. ఏకంగా పేరు మార్చుకున్నవారూ లేకపోలేదు.

అమెజాన్‌ సంస్థ వర్చువల్ అసిస్టెంట్ ‘అలెక్సా’ కారణంగా తమ పిల్లలు అవహేళనకు, ఎగతాళికి గురవుతున్నారని.. ఇది వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఒత్తిడికి గురిచేస్తోందని పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది పేరెంట్స్‌ తమ పిల్లల పేర్లు మార్చుకోగా, కొందరు మాత్రం ‘అలెక్సా’ అనే పేరును మార్చాలని అమెజాన్‌ను డిమాండ్ చేస్తున్నారు. మనిషిని అవమానించడానికి, హీనంగా చూడటానికి ఇది లైసెన్స్‌గా మారిందని.. అమెజాన్ ఈ పేరు పెట్టే ముందు నైతికత గురించి ఆలోచించలేదని భావిస్తున్నారు.

ఇక 2014లో ప్రారంభమైన అలెక్సాపై అప్పటి నుంచే అక్కడక్కడా వ్యతిరేకత ఎదురవగా, ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. ఒక్క యూకేలోనే ‘అలెక్సా’ పేరున్న పాతికేళ్ల లోపు వ్యక్తులు 4,000 మందికి పైగా ఉండగా.. అమెరికా, జర్మనీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. కాగా ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై స్పందించిన అమెజాన్ ఒక ప్రకటన చేసింది. ‘పిల్లలకు ఇలా జరగడం బాధాకరం. ఇందుకు చింతిస్తున్నాం అయినా ఎదుటి వారిని ఎగతాళి చేయడం, ఏడిపించడం, నొప్పించడం సరికాదు. దీన్ని ఖండిస్తున్నాం. అలెక్సా పేరుకు ప్రత్యామ్నాయంగా ఉన్న ‘ఎకో, కంప్యూటర్, అమెజాన్‌’ వంటి పేర్లను కూడా వాడుకోవచ్చు’ అని యూజర్లకు సూచించింది.

Tags:    

Similar News