వచ్చే నెల 1 నుంచి కొత్త IFSC కోడ్‌లు
దిశ వెబ్‌డెస్క్: బ్యాంకు ఖాతాదారులకు గమనిక. మనం ఎవరికైనా ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపాలంటే.. IFSC కోడ్ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ IFSC కోడ్‌లు మారబోతున్నాయి. బ్యాంకుల విలీనంతో IFSC కోడ్‌లు మారుతున్నాయి. అందులో భాగంగా ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకుల IFSC కోడ్‌లు వచ్చే నెల 1 నుంచి మారి కొత్తవి రాబోతున్నాయి. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం విలీనం చేయడంతో.. విలీన ప్రక్రియ ఇప్పుడిప్పుడే […]
దిశ వెబ్‌డెస్క్: బ్యాంకు ఖాతాదారులకు గమనిక. మనం ఎవరికైనా ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపాలంటే.. IFSC కోడ్ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ IFSC కోడ్‌లు మారబోతున్నాయి. బ్యాంకుల విలీనంతో IFSC కోడ్‌లు మారుతున్నాయి. అందులో భాగంగా ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకుల IFSC కోడ్‌లు వచ్చే నెల 1 నుంచి మారి కొత్తవి రాబోతున్నాయి. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం విలీనం చేయడంతో.. విలీన ప్రక్రియ ఇప్పుడిప్పుడే జరుగుతోంది.
దీంతో వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులకు కొత్త IFSC కోడ్‌లు అమల్లోకి తీసుకొస్తున్నట్లు యూనియన్ బ్యాంకు తెలిపింది. ఆంధ్రా బ్యాంకు IFSC కోడ్‌లను యూబీఐఎన్ 08తో మొదలయ్యే విధంగా మార్చుతుండగా.. కార్పొరేషన్ బ్యాంకు IFSC కోడ్‌లను 09తో మొదలయ్యేలా మార్చుతున్నారు.
ఇక ప్రస్తుతమున్న ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకుల చెక్ బుక్‌లు వచ్చే నెల 1 తర్వాత పనిచేయవు. వాటి స్థానంతో కొత్త IFSC కోడ్, ఎంఐసీఆర్ నెంబర్ గల యూనియన్ బ్యాంక్ చెక్ బుక్‌లు రానున్నాయి.