పాలక్కడ్‌లో కొత్త తొండ జాతి.. పేరేంటో తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని పశ్చిమ కనుమల్లో ఒక కొత్త రకం తొండ జాతిని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పాలక్కడ్ దగ్గర దొరికింది కాబట్టి దీనికి ‘పాలక్కడ్ డ్వార్ఫ్ గెకో లేదా నెమాస్పిస్ పాలక్కడెన్సిస్’ అని పేరు పెట్టారు. అయితే ఈ కొత్త జాతిని కనిపెట్టడం చాలా అకస్మాత్తుగా జరిగిందని హెర్పటాలజిస్ట్ అమిత్ సయ్యద్ తెలిపారు. కొన్నేళ్ల నుంచి ఈ కొత్త జాతి తొండ.. ఫీల్డ్ సర్వేకు వచ్చిన పరిశోధకుల కళ్లుగప్పి తప్పించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. […]

Update: 2020-09-12 04:46 GMT
పాలక్కడ్‌లో కొత్త తొండ జాతి.. పేరేంటో తెలుసా?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని పశ్చిమ కనుమల్లో ఒక కొత్త రకం తొండ జాతిని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పాలక్కడ్ దగ్గర దొరికింది కాబట్టి దీనికి ‘పాలక్కడ్ డ్వార్ఫ్ గెకో లేదా నెమాస్పిస్ పాలక్కడెన్సిస్’ అని పేరు పెట్టారు. అయితే ఈ కొత్త జాతిని కనిపెట్టడం చాలా అకస్మాత్తుగా జరిగిందని హెర్పటాలజిస్ట్ అమిత్ సయ్యద్ తెలిపారు. కొన్నేళ్ల నుంచి ఈ కొత్త జాతి తొండ.. ఫీల్డ్ సర్వేకు వచ్చిన పరిశోధకుల కళ్లుగప్పి తప్పించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. నెమాస్పిస్ వర్గానికి చెందిన లిట్టోరాలిస్ జాతి తొండలతో దీనికి చాలా పోలికలు ఉన్నాయని, అందుకే ఇది ఆ జాతికి చెందినదేనని పరిశోధకులు అనుకుని ఉంటారని అమిత్ అభిప్రాయపడ్డారు. అయితే జన్యు విశ్లేషణ ద్వారా పరిశోధించే చూస్తే.. నిర్మాణాత్మకంగా, పరిణామక్రమం ఆధారంగా లిట్టోరాలిస్ జాతితో అనేక విభిన్న లక్షణాలు ఈ కొత్త జాతి తొండలకు ఉన్నట్లు తేలిందని చెప్పారు.

వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ అండ్ రీసెర్చి సొసైటీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న అమిత్ సయ్యద్.. గత పదిహేనేళ్ల నుంచి రావోర్చేస్టస్ అనే కప్ప జాతి గురించి, నెమాస్పిస్ అనే తొండ వర్గం గురించి పరిశోధనలు చేస్తున్నారు. మే, 2019లో పాలక్కడ్‌లోని అన్నాకల్‌లో సరీసృపాల సర్వే ట్రిప్ నిర్వహించారు. ఆ ట్రిప్‌లో భాగంగానే అనుకోకుండా ఈ కొత్త తొండ జాతికి చెందిన తొండను కనిపెట్టారు. అది కొంచెం విభిన్నంగా కనిపించడంతో ల్యాబ్‌కు తీసుకెళ్లి జన్యువిశ్లేషణ చేస్తే కొత్త జాతి అని తేలింది. ఇది చిన్నగా చూపుడు వేలు సైజులో ఉండి, నలుపు గోధుమ రంగు చారలను కలిగి ఉంది. అలాగే ముఖం దగ్గర నారింజ రంగు షేడ్ కూడా ఉందని అమిత్ వివరించారు. తొండ జాతుల్లో ఇది 43వ జాతి. ఇంకా పరిశోధిస్తే ఇలాంటి జాతులు ఎన్నో పశ్చిమ కనుమల్లో ఉండే అవకాశం ఉందని అమిత్ వెల్లడించారు.

Tags:    

Similar News