కోఠి ఉమెన్స్​ కాలేజీలో కొత్త కోర్సులు

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ అటానమస్​గా ఉన్న కోఠి ఉమెన్స్​ కాలేజీలో బీఏ హానర్స్ ఎకనామిక్​, పొలిటికల్​ సైన్స్ కొత్త కోర్సులు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆ ప్రత్యేక కోర్సులను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కోఠి ఉమెన్స్ కాలేజీ, నిజాం కాలేజీలలో బీ.ఏ. హానర్స్ కోర్సులను బోధించనున్నట్లు తెలిపారు. ఈ కోర్సుల వల్ల విద్యార్థులకు ఎంతో […]

Update: 2021-09-21 10:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ అటానమస్​గా ఉన్న కోఠి ఉమెన్స్​ కాలేజీలో బీఏ హానర్స్ ఎకనామిక్​, పొలిటికల్​ సైన్స్ కొత్త కోర్సులు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆ ప్రత్యేక కోర్సులను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కోఠి ఉమెన్స్ కాలేజీ, నిజాం కాలేజీలలో బీ.ఏ. హానర్స్ కోర్సులను బోధించనున్నట్లు తెలిపారు.

ఈ కోర్సుల వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వీటి వలన పోటి ప్రపంచంలో నిలదొక్కుకోగలుగుతారన్నారు. ప్రస్తుతం హానర్స్ కోర్సులు ఢిల్లీ వంటి నగరాలలోనే ఉందని, ఇప్పుడు హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీ దేవీ, కాలేజీయేట్ కమీషనర్ నవీన్ మిట్టల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట రమణ, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి, కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విజ్జులత, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News