తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త వైరస్ కలకలం

దిశ,వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల యూకే నుంచి తెలంగాణ వచ్చిన 21 మందికి టెస్ట్ లు చేయగా ఇద్దరికి కరోనా కొత్త వైరస్ కరోనా సోకింది. యూకే నుంచి వరంగల్ అర్బన్‌కు వచ్చిన 49ఏళ్ల వ్యక్తికి ఈ కొత్తరకం కరోనా సోకినట్లు సీసీఎంబీ అధికారులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు సంబంధిత వ్యక్తులతో సన్నిహతంగా ఉన్న కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు కరోనా టెస్ట్ లు నిర్వహించారు. […]

Update: 2020-12-28 23:38 GMT

దిశ,వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల యూకే నుంచి తెలంగాణ వచ్చిన 21 మందికి టెస్ట్ లు చేయగా ఇద్దరికి కరోనా కొత్త వైరస్ కరోనా సోకింది. యూకే నుంచి వరంగల్ అర్బన్‌కు వచ్చిన 49ఏళ్ల వ్యక్తికి ఈ కొత్తరకం కరోనా సోకినట్లు సీసీఎంబీ అధికారులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు సంబంధిత వ్యక్తులతో సన్నిహతంగా ఉన్న కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు కరోనా టెస్ట్ లు నిర్వహించారు. ఈ కరోనా టెస్టుల్లో బాధితుడి తల్లికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారికి ట్రీట్మెంట్ కొనసాగుతుండగా.., అటు ఏపీలోనూ కరోనా కొత్త వైరస్ టెన్షన్ మొదలైంది. డిసెంబర్ నెల ప్రారంభం‌లో బ్రిటన్ నుంచి 1346 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చారు. వీరిలో 1324 మందిని అధికారులు గుర్తించి, క్వారంటైన్‌కు తరలించారు. మరో 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News