కొత్త రకం కరోనా కేసులు 25కు చేరిక..

న్యూఢిల్లీ : యూకేలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు భారత్‌లో 25కు చేరాయి. గురువారం కొత్తగా ఐదు కేసులు నమోదయ్యాయి. పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో నాలుగు కేసులు, ఢిల్లీలోని సీఎస్ఐఆర్-ఇన్‌స్టిట్యూ్ట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీలో ఒక కేసు రిపోర్ట్ అయింది. వీరందరినీ ఆయా రాష్ట్రాల్లోని ప్రత్యేక ఐసొలేషన్ గదుల్లో ఉంచారు. మొత్తం 25 మందిని హెల్త్ ఫెసిలిటీల్లోని ఐసొలేషన్‌లో ఉంచినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కొత్తరకం కరోనా […]

Update: 2020-12-31 06:26 GMT

న్యూఢిల్లీ : యూకేలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు భారత్‌లో 25కు చేరాయి. గురువారం కొత్తగా ఐదు కేసులు నమోదయ్యాయి. పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో నాలుగు కేసులు, ఢిల్లీలోని సీఎస్ఐఆర్-ఇన్‌స్టిట్యూ్ట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీలో ఒక కేసు రిపోర్ట్ అయింది. వీరందరినీ ఆయా రాష్ట్రాల్లోని ప్రత్యేక ఐసొలేషన్ గదుల్లో ఉంచారు.

మొత్తం 25 మందిని హెల్త్ ఫెసిలిటీల్లోని ఐసొలేషన్‌లో ఉంచినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కొత్తరకం కరోనా వైరస్ కేసులు మంగళవారం తొలిసారిగా ఆరుగురిలో పాజిటివ్ తేలగా, బుధవారం 14 మంది నమూనాలూ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. బ్రిటన్‌లో కనిపించిన రూపాంతరం చెందిన కరోనా వైరస్ 70శాతం అధిక వేగంతో వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని నిపుణులు పేర్కొన్న విషయం విదితమే.

Tags:    

Similar News