నిన్న తగ్గి.. ఇవాళ మళ్లీ పెరిగాయి.. కాటేస్తున్న కరోనా

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా రెండో దశ ప్రారంభం కాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన పదిహేను రోజులుగా వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతున్నది. అయితే దేశవ్యాప్తంగా మంగళవారం కొవిడ్-19 కేసుల సంఖ్య కాస్త తగ్గగా.. బుధవారం మళ్లీ పెరిగింది. నిన్నటితో పోల్చితే ఈరోజు ఏకంగా 7 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,262 మందికి కరోనా […]

Update: 2021-03-23 23:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా రెండో దశ ప్రారంభం కాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన పదిహేను రోజులుగా వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతున్నది. అయితే దేశవ్యాప్తంగా మంగళవారం కొవిడ్-19 కేసుల సంఖ్య కాస్త తగ్గగా.. బుధవారం మళ్లీ పెరిగింది. నిన్నటితో పోల్చితే ఈరోజు ఏకంగా 7 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,262 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇది మంగళవారం (40,715) తో పోల్చితే దాదాపు ఏడు వేలు అధికం. కానీ సోమవారం దేశవ్యాప్తంగా 46,951 మంది కరోనా బారిన పడ్డారు. ఇక కరోనా సోకి మరణించిన వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతుంది. గత 24 గంటల్లో 275 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,60,441 కు చేరుకుంది.

Tags:    

Similar News