వైఎస్ బాటలో కేసీఆర్.. టీఎస్ ఆర్టీసీ బస్సులు సరికొత్తగా..
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీ కొత్త కళ రాబోతోంది. బస్సులు తన రూపును మార్చుకోబోతున్నాయి. పల్లె వెలుగు నుంచి గరుడా బస్ వరకు ఇప్పుడున్న రంగుల్ని మార్చేందుకు అధికారులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం బస్సులకు ఉన్న రంగులను దాదాపు 15 ఏళ్ల కిందట ఖరారు చేయగా.. వాటిని మార్చి కొత్త రంగులు వేసేలా సజ్జనార్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న బస్సులకు రంగులు ఎప్పుడు వేశారు? ఎంత ఖర్చవుతుంది? ఎంత సమయం పడుతుంది? తదితర […]
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీ కొత్త కళ రాబోతోంది. బస్సులు తన రూపును మార్చుకోబోతున్నాయి. పల్లె వెలుగు నుంచి గరుడా బస్ వరకు ఇప్పుడున్న రంగుల్ని మార్చేందుకు అధికారులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం బస్సులకు ఉన్న రంగులను దాదాపు 15 ఏళ్ల కిందట ఖరారు చేయగా.. వాటిని మార్చి కొత్త రంగులు వేసేలా సజ్జనార్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న బస్సులకు రంగులు ఎప్పుడు వేశారు? ఎంత ఖర్చవుతుంది? ఎంత సమయం పడుతుంది? తదితర అంశాలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం.
ఈక్రమంలో బస్సుల రంగు మార్చేందుకు, చిన్న చిన్న మార్పులు చేసేందుకు ఎంత అవుతుందో లెక్కలు వేస్తున్నారు. బస్సులకు వేసే రంగుల్లో తెలుపురంగుకు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని ఎండీ సజ్జనార్ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, సంస్థలో ఉన్న పల్లెవెలుగు బస్సులకు ఉన్న రంగును పాడి-పంటలకు చిహ్నంగా తెలుపు-ఆకుపచ్చ రంగు వేయాలని 2007లోనే నిర్ణయించగా.. ఇప్పటికీ అదే రంగు కొనసాగిస్తున్నారు.
నగరంలో కొన్ని రూట్లకు నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను 2019లో ప్రవేశ పెట్టగా వాటికి కూడా పచ్చదనానికి ప్రతీకగా ఉండేందుకు ఆకుపచ్చ రంగును వేశారు. అయితే, ఇలా అన్నింటిని పరిశీలించి వేటికి ఏఏ రంగులు పరిశీలించాలి, వేటిని తొలగించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. అయితే, రాష్ట్రంలో నడిచే చాలా బస్సుల రంగులు ఇప్పటికే వెలిసిపోయి పాతవిలా కనిపిస్తున్నాయని, వాటికి రంగులు దిద్ది ప్రయాణికులను ఆకర్షించేలా చర్యలు తీసుకోనున్నట్లు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. కాగా ఆర్టీసీ బస్‌లకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాత రంగులను మార్చి కొత్త డిజైన్లతో కలర్ వేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ సైతం అదే బాటలో నడవనున్నారు.