‘చెక్ ఇన్ మాస్టర్’ యాప్‌తో టిక్కెట్ కలెక్టర్ సేఫ్..

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వైరస్ ప్రభావం దారుణంగా ఉంది. ఇప్పటికే అక్కడ లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా అక్కడ ఎక్కవగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల టికెట్లు తనిఖీకి చేసేందుకు సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్ ఓ కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులను ముట్టుకోకుండానే టికెట్లను తనిఖీ చేసేందుకు ‘చెక్ ఇన్ మాస్టర్’ పేరుతో యాప్‌ను […]

Update: 2020-07-24 08:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వైరస్ ప్రభావం దారుణంగా ఉంది. ఇప్పటికే అక్కడ లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా అక్కడ ఎక్కవగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల టికెట్లు తనిఖీకి చేసేందుకు సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్ ఓ కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులను ముట్టుకోకుండానే టికెట్లను తనిఖీ చేసేందుకు ‘చెక్ ఇన్ మాస్టర్’ పేరుతో యాప్‌ను రూపొందించారు.

దీనిద్వారా…రైల్వే టీసీలు ప్రయాణికుల వద్ద ఉన్న టికెట్లను తాకకుండా తమ మొబైల్స్‌ ఫోన్‌లోని ఈ యాప్ ద్వారా వాటిని తనిఖీ చేస్తున్నారు. రైల్వే టికెట్ల పై ఉండే బార్ కోడ్, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పరిశీలిస్తారు. తొలుత ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్టేషన్‌లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. టికెట్లు తనిఖీ చేసే రైల్వే సిబ్బందికి కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ఈ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News