బండ్లన్నా.. కాసింత చూసుకోవాలి కదా! ఆటాడుకున్న నెటిజన్లు
దిశ, సినిమా: ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తను చేసిన రాంగ్ ట్వీట్‌తో నెటిజన్లు ఓ ఆట ఆడుకోగా, సోషల్ మీడియాలో మరోసారి నవ్వులపాలయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..కరోనా నిబంధనల ప్రకారం మాస్క్ పెట్టుకోకపోవడంతో పోలీసులు రూ.2,000 ఫైన్ వేశారనే ఓ రిసిప్ట్ షేర్ చేస్తూ ‘మాస్క్ తప్పక ధరించండి లేదంటే మీరు కూడా ఫైన్ కట్టాల్సి వస్తుందనే’ మెసేజ్ ఇస్తూ ట్వీట్ చేయాలనుకున్నాడు బండ్ల గణేశ్ బాబు. అయితే ఇక్కడే బండ్ల బుక్ […]
దిశ, సినిమా: ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తను చేసిన రాంగ్ ట్వీట్‌తో నెటిజన్లు ఓ ఆట ఆడుకోగా, సోషల్ మీడియాలో మరోసారి నవ్వులపాలయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..కరోనా నిబంధనల ప్రకారం మాస్క్ పెట్టుకోకపోవడంతో పోలీసులు రూ.2,000 ఫైన్ వేశారనే ఓ రిసిప్ట్ షేర్ చేస్తూ ‘మాస్క్ తప్పక ధరించండి లేదంటే మీరు కూడా ఫైన్ కట్టాల్సి వస్తుందనే’ మెసేజ్ ఇస్తూ ట్వీట్ చేయాలనుకున్నాడు బండ్ల గణేశ్ బాబు. అయితే ఇక్కడే బండ్ల బుక్ అయ్యాడు. తెలుగులో మాస్క్ ధరించండి అని చెప్పినా సరిపోయేది కానీ ఎప్పటిలాగే ఎక్స్‌ట్రాలకు పోయిన ఈ కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్..వచ్చీ రానీ ఇంగ్లిష్‌లో ట్వీట్ చేశాడు. ‘Wear Mask’ అని కాకుండా ‘Where Mask’ అని పోస్ట్ పెట్టాడు. దీంతో బండ్ల ఎప్పుడు దొరికిపోతాడా అని వెయిట్ చేసే నెటిజన్లకు చక్కని అవకాశం దొరకడంతో ఆడేసుకున్నారు. ‘అన్నా..నీ ఇంగ్లిష్ దెబ్బతో మాకొచ్చిన కాస్త ఇంగ్లిష్ కూడా మరిచిపోయేలా ఉన్నాం..ముందు ఆ స్పెల్లింగ్ మార్చు’ అని రిప్లై ఇచ్చారు.
Ware mask 😷 @besafe @CPHydCity @DCPWZHyd pic.twitter.com/v8DEWaeP1T
— BANDLA GANESH. (@ganeshbandla) March 29, 2021
దీంతో ఆ ట్వీట్ డిలీట్ చేసిన బండ్ల..కామ్‌గా ఉండకుండా మళ్లీ ‘Ware Mask’ అని..మళ్లీ రాంగ్ స్పెల్లింగ్‌తోనే ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు మరోసారి రెచ్చిపోయారు. ‘అన్నా..ఇంగ్లిష్ రాకపోతే నేర్చుకుని ట్వీట్ చేయ్..లేదా ట్విట్టర్ హ్యాండిల్ కోసం ఓ వ్యక్తిని పెట్టుకో..కానీ ఇలాంటి బట్లర్ ఇంగ్లిష్‌తో మమ్మల్ని చంపొద్దు’ అని కామెంట్స్ చేస్తున్నారు.
నీ దెబ్బకు నేను కూడా spellings మర్చిపోయా అన్నా..అది where ,ware కాదన్నా wear అంటే ధరించడం
— Kkr1995 (@kiranponna_1995) March 30, 2021
inka chala unaayi, appude relax avvakandi… next in the line "were", "whare"….
— Naveen K (@naveenk_mp) March 29, 2021
Nuvu IIT colleges lo clases cheppochu kadha. What an intelligent fellow
— @Rocky (@NbBalaga) March 29, 2021