నెట్‌ఫ్లిక్స్ నయా ఫీచర్.. నచ్చిన కంటెంట్ ఆటోమేటిక్‌ డౌన్‌లోడ్

దిశ, ఫీచర్స్: ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్‌కు భారత్‌ అతిపెద్ద మార్కెట్. ఇక్కడ అత్యధిక పాపులేషన్‌‌కు తోడు ఇంటర్నెట్ చార్జీలు తక్కువగా ఉండటం, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో ఓటీటీల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గుడ్ కంటెంట్‌తో ఏ కొత్త ప్లాట్‌ఫామ్ వచ్చినా మార్కెట్‌లో నిలబడుతోంది. పైగా కొవిడ్ వల్ల ప్రజలు కొంతకాలం ఇండ్లకే పరిమితమవడంతో మొబైల్‌ఫోన్ వాడకం పెరగడమూ ఓ కారణంగా చెప్పొచ్చు. కాగా, ప్రాంతీయతను జోడించి జనాలకు నచ్చిన కంటెంట్ అందిస్తున్నందునే […]

Update: 2021-02-23 02:53 GMT

దిశ, ఫీచర్స్: ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్‌కు భారత్‌ అతిపెద్ద మార్కెట్. ఇక్కడ అత్యధిక పాపులేషన్‌‌కు తోడు ఇంటర్నెట్ చార్జీలు తక్కువగా ఉండటం, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో ఓటీటీల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గుడ్ కంటెంట్‌తో ఏ కొత్త ప్లాట్‌ఫామ్ వచ్చినా మార్కెట్‌లో నిలబడుతోంది. పైగా కొవిడ్ వల్ల ప్రజలు కొంతకాలం ఇండ్లకే పరిమితమవడంతో మొబైల్‌ఫోన్ వాడకం పెరగడమూ ఓ కారణంగా చెప్పొచ్చు. కాగా, ప్రాంతీయతను జోడించి జనాలకు నచ్చిన కంటెంట్ అందిస్తున్నందునే నెట్‌ఫ్లిక్స్‌కు సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగి.. గ్లోబల్ ఓటీటీగా మారింది. ఈ క్రమంలోనే వినియోగదారుల సౌకర్యార్థం నెట్‌ఫ్లిక్స్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు ‘Downloads for You’ ఫీచర్ ద్వారా కస్టమర్లకు నచ్చిన కంటెంట్ ఆటోమేటిక్‌గా తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్‌లోడ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ తమ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

మూడేళ్ల కిందట అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ డౌన్‌లోడ్స్ (Smart Downloads) ఫీచర్‌ ద్వారా కస్టమర్‌కు తన ఫేవరెట్ షో తరువాతి ఎపిసోడ్ ఈజీగా అందుబాటులోకి రాగా, ఈ ‘డౌన్ లోడ్స్‌ ఫర్ యూ’ ద్వారా కంటెంట్ స్మార్ట్ ఫోన్‌లో ఆటోమేటిక్‌గా స్టోర్ అవుతుంది. ఇందుకు వినియోగదారుడు యాప్‌లోని ‘డౌన్‌లోడ్స్’ ట్యాబ్ సెలక్ట్ చేసుకుని, డివైజ్‌లో ఎంతవరకు కంటెంట్ డౌన్‌లోడ్ కావాలో (ఉదా : 1 జీబీ – 5 జీబీ వరకు) ఎంచుకుని ఆ ఫీచర్ టర్న్ ఆన్ చేయాలి. అయితే ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే ఐఓఎస్(IOS) ఫోన్లలో యాడ్ చేయనున్నారు.

Tags:    

Similar News