లైఫ్‌ బ్యూటిఫుల్‌గా మార్చావ్ నేహా.. ఫియాన్సి

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ ఫిమేల్ సింగర్ నేహా కక్కర్ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. పంజాబీ సింగర్ రోహన్ ప్రీత్ సింగ్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న నేహా.. ఈ మధ్య వారి రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో రోకా ఫంక్షన్ చేసుకుని.. ఈ రిలేషన్‌ను లీగల్ చేసేసింది. కాగా రోకా ఫంక్షన్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన నేహా.. ‘భవిష్యత్తులో ఒకటి కాబోతున్న మా ఇద్దరికీ ఆశీర్వాదాలు అందించండి’ అని […]

Update: 2020-10-22 01:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ ఫిమేల్ సింగర్ నేహా కక్కర్ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. పంజాబీ సింగర్ రోహన్ ప్రీత్ సింగ్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న నేహా.. ఈ మధ్య వారి రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో రోకా ఫంక్షన్ చేసుకుని.. ఈ రిలేషన్‌ను లీగల్ చేసేసింది. కాగా రోకా ఫంక్షన్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన నేహా.. ‘భవిష్యత్తులో ఒకటి కాబోతున్న మా ఇద్దరికీ ఆశీర్వాదాలు అందించండి’ అని కోరింది.

దీంతో పాటు రోహన్ తనకు ప్రపోజ్ చేసిన రోజు పిక్స్ కూడా అభిమానులతో పంచుకున్న నేహా.. తనతో లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉంటుందని తెలిపింది. దీనిపై లవ్‌లీ రిప్లయ్ ఇచ్చాడు రోహన్. నా జీవితంలో మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్‌గా ఉన్నందుకు థాంక్స్ చెప్పాడు. నీ చిన్న చిరునవ్వుతో కనెక్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ క్షణం చాలా సంతోషంగా ఉన్నానన్న రోహన్.. భవిష్యత్తులోనూ ప్రతీ మూమెంట్ ఇలాగే ఉండాలని, ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇక ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్.. లైఫ్ లాంగ్ ఇంతే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. కాగా త్వరలోనే పెళ్లికి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు.

Tags:    

Similar News