సెక్స్ అప్పీల్ ఎక్కడో లేదు.. అక్కడే : నేహా భాసిన్
దిశ, సినిమా : సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ కామెంట్స్‌పై సింగర్ నేహా భాసిన్ తాజాగా స్పందించింది. ఇలాంటి కామెంట్స్ మనుషుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అవి ఎంత పెద్ద ప్రమాదానికి దారితీయగలవో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. పాప్ గ్రూప్ ‘వైవా’తో ఒప్పందం కుదుర్చుకున్న టైమ్‌లో తను 49 కిలోలు ఉన్నానని.. లాక్‌డౌన్‌లో బరువు పెరిగి ప్రస్తుతం 65 కిలోలకు చేరుకున్నానని తెలిపింది నేహా. ఈ క్రమంలో తనకు తాను ఎప్పుడూ సెక్సీగా కనిపించలేదని, […]
దిశ, సినిమా : సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ కామెంట్స్‌పై సింగర్ నేహా భాసిన్ తాజాగా స్పందించింది. ఇలాంటి కామెంట్స్ మనుషుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అవి ఎంత పెద్ద ప్రమాదానికి దారితీయగలవో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. పాప్ గ్రూప్ ‘వైవా’తో ఒప్పందం కుదుర్చుకున్న టైమ్‌లో తను 49 కిలోలు ఉన్నానని.. లాక్‌డౌన్‌లో బరువు పెరిగి ప్రస్తుతం 65 కిలోలకు చేరుకున్నానని తెలిపింది నేహా. ఈ క్రమంలో తనకు తాను ఎప్పుడూ సెక్సీగా కనిపించలేదని, అయినా ఈ విషయంలో ఎప్పుడూ బాధపడలేదని చెప్పింది. ‘బరువు అనేది ఒక నంబర్.. అదెప్పుడైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిని బాడీ షేమింగ్ గురించి మాట్లాడి అవమానించడం హానికరం, విషపూరితం’ అని వివరించింది. సెక్స్ అప్పీల్ అనేది మనలో ఉంటుంది కానీ, మన శరీరభాగాల్లో కాదని తెలుసుకోవాలని సూచించింది.
సెక్సీయెస్ట్ ఆఫ్ ఆలై టైమ్స్ ‘మాతా హరి’ సైజ్ జీరో కాదని.. కానీ ఆమె ఇప్పటికీ సెక్సీ లేడీగా ఆరాధించబడుతుండటం మనం చూస్తున్నాం కదా! అంటూ తనపై వచ్చే కామెంట్లకు కౌంటర్ ఇచ్చింది నేహా. కనీసం ఇలాంటి విషయాలను ఎగ్జాంపుల్‌గా తీసుకుని అయినా మానవ శరీరాలను వాటి సహజ రూపంలో స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటే బాగుంటుందని కోరింది. తను ఫిట్‌నెస్ కోసం ఇంట్రెస్ట్ చూపుతాను కానీ, సైజ్ జీరో మస్ట్ అంటూ ఫ్యాట్ షేమింగ్ గురించి మాట్లాడి ఎవరినీ అగౌరవపరచనని తెలిపింది. అందం విషయంలో తనతో పాటు ఇతరులను జడ్జ్ చేయడం సోషల్ మీడియాలో కామన్ అయిపోయిందన్న నేహా భాసిన్.. ఇది తప్పుడు సందేశాన్ని ఇస్తుందని చెప్పింది. ఫేక్ బ్యూటీ స్టాండర్డ్స్ గురించి మాట్లాడి ఇతరుల జీవితాలను తప్పుదోవ పట్టించకూడదని కోరింది.