ఆరోగ్యంతో చెలగాటం.. వాటర్ ప్లాంట్స్‌లో నీళ్లు తాగితే అంతే సంగతి.?

దిశ, పిట్లం : మండల కేంద్రంలో మినరల్ వాటర్ ప్లాంట్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మొత్తం పిట్లం మండల కేంద్రంలో సుమారు 10 వాటర్ ప్లాంట్స్ నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ఈ నిబంధనలు పాటించాలి. 1) వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధిత పంచాయతీ అనుమతి తప్పని సరిగా ఉండాలి. 2) భారతీయ ప్రమాణాలు ఐఎస్ఐ గుర్తింపు పొందాలి. 3) ప్లాంట్‌లో మైక్రో బయోలాజిస్ట్, […]

Update: 2021-09-03 06:15 GMT

దిశ, పిట్లం : మండల కేంద్రంలో మినరల్ వాటర్ ప్లాంట్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మొత్తం పిట్లం మండల కేంద్రంలో సుమారు 10 వాటర్ ప్లాంట్స్ నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ఈ నిబంధనలు పాటించాలి.

1) వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధిత పంచాయతీ అనుమతి తప్పని సరిగా ఉండాలి.
2) భారతీయ ప్రమాణాలు ఐఎస్ఐ గుర్తింపు పొందాలి.
3) ప్లాంట్‌లో మైక్రో బయోలాజిస్ట్, కెమికల్ ల్యాబ్, ఇద్దరు ల్యాబ్ టెక్నిషన్స్ ఉండాలి.
4) ప్రతీ మూడు నెలలకొకసారి నీటి నాణ్యతా ప్రమాణాలు నిర్దారించేందుకు పరీక్షలు చేయాలి.

కానీ, ఈ నిబంధనలేవీ పాటించకుండా విచ్చల విడిగా వాటర్ ప్లాంట్స్ నడిపిస్తున్నారు. వాటర్ ప్లాంట్స్‌లో వాడే నీరు స్థానికంగా లభించే బోర్ల నుంచి తీసుకొని వాటిని శుద్ధి చేసి డబ్బాలను విక్రయిస్తున్నారు. చుట్టుపక్కల లభించే నీటిలో టోటల్ డిజాల్వ్ సాలిడ్(టీడీఎస్) 1500 నుంచి 2000 వరకు ఉంటుంది.

వీటిలో అత్యధికంగా 1000 దాటితే అవి తాగడానికి పనికి రావు. ఆ నీటిని తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలు, ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య సిబ్బంది హెచ్చరిస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News