సెప్టెంబర్ 12న నీట్ యూజీ
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు నూతన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం వెల్లడించారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ‘భౌతికదూరం నిబంధనల మేరకు ఈ పరీక్ష నిర్వహించే పట్టణాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచుతున్నాం. గతేడాది 3,862గా ఉన్న పరీక్షా కేంద్రాలనూ పెంచనున్న’ట్టు వెల్లడించారు. కొవిడ్-19 ప్రొటోకాల్స్‌కు కట్టుబడి అభ్యర్థులందరికీ పరీక్షా […]
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు నూతన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం వెల్లడించారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
‘భౌతికదూరం నిబంధనల మేరకు ఈ పరీక్ష నిర్వహించే పట్టణాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచుతున్నాం. గతేడాది 3,862గా ఉన్న పరీక్షా కేంద్రాలనూ పెంచనున్న’ట్టు వెల్లడించారు. కొవిడ్-19 ప్రొటోకాల్స్‌కు కట్టుబడి అభ్యర్థులందరికీ పరీక్షా కేంద్రాల వద్ద మాస్క్‌లు అందజేయనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, విద్యార్థుల ఎంట్రీ, ఎగ్జిట్‌లకు టైం స్లాట్, కాంటాక్ట్‌లెస్ రిజిస్ట్రేషన్, గదుల్లో శానిటైజేషన్, భౌతిక దూరం పాటించేలా సీటింగ్ వంటి జాగ్రత్తలు తీసుకుంటామని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.
కాగా, తొలుత ఆగస్టు 1న నీట్ నిర్వహిస్తామని మార్చిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కరోనా సంబంధిత కారణాలతో దీన్ని సెప్టెంబర్ 12కు పోస్ట్‌పోన్ చేసింది.