సరిహద్దు సమస్యపై వివరణ ఇవ్వాల్సిందే…..
ఇండియా, చైనా సరిహద్దు సమస్యపై కేంద్రం పూర్తి వివరణ ఇవ్వాలని ఎన్ సీపీ నేత శరద్ పవార్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. బీజేపీ నేత జువల్ ఓరామ్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హాజరయ్యారు. ఈ సమావేశంలో లఢక్ పరిస్థితిపై కేంద్రం వివరణ ఇవ్వాలని కొందరు పట్టుబట్టారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ […]
ఇండియా, చైనా సరిహద్దు సమస్యపై కేంద్రం పూర్తి వివరణ ఇవ్వాలని ఎన్ సీపీ నేత శరద్ పవార్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. బీజేపీ నేత జువల్ ఓరామ్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హాజరయ్యారు. ఈ సమావేశంలో లఢక్ పరిస్థితిపై కేంద్రం వివరణ ఇవ్వాలని కొందరు పట్టుబట్టారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. కాగా మరో వైపు సరిహద్దు అంశంపై చర్చించేందుకు ఓ సమావేశాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏర్పాటు చేశారు. దీనికి బిపిన్ రావత్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల చీఫ్‌లు హాజరయ్యారు. వాస్తవాధీన రేఖ(ఎల్ ఏసీ)వద్ద నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు.