ఆ హీరోయిన్లు చిరును ఎందుకు ఇష్టపడటం లేదు?

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత పలు రీమేక్ సినిమాలను లైన్‌లో పెట్టగా.. ఇందులో మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ‘లూసిఫర్’ కూడా ఒకటి. నేటివిటీకి, చిరు స్టామినాకు తగినట్లుగా స్క్రిప్ట్‌లో మార్పులు జరగ్గా, ప్రత్యేకంగా హీరోయిన్ రోల్‌ను యాడ్ చేశారు మోహన్ రాజా. ఈ క్యారెక్టర్‌ ప్లే చేసేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించగా.. ఓకే చెప్పిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తను ప్రాజెక్ట్‌ […]

Update: 2021-02-22 02:44 GMT

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత పలు రీమేక్ సినిమాలను లైన్‌లో పెట్టగా.. ఇందులో మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ‘లూసిఫర్’ కూడా ఒకటి. నేటివిటీకి, చిరు స్టామినాకు తగినట్లుగా స్క్రిప్ట్‌లో మార్పులు జరగ్గా, ప్రత్యేకంగా హీరోయిన్ రోల్‌ను యాడ్ చేశారు మోహన్ రాజా. ఈ క్యారెక్టర్‌ ప్లే చేసేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించగా.. ఓకే చెప్పిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తను ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోగా, ఈ ప్లేస్‌లో స్మైలింగ్ క్వీన్ త్రిషా కృష్ణన్ చేరబోతోందని ఫిల్మ్ నగర్ టాక్.

కానీ త్రిష కూడా ఇంతకు ముందు చిరుతో ఓ సినిమాకు నో చెప్పింది. ‘స్టాలిన్‌’లో మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న త్రిషకు చిరు ‘ఆచార్య’లోనూ చాన్స్ వచ్చింది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్‌ అంటూ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది భామ. దీంతో ఈ పాత్రకు కాజల్ అగర్వాల్‌ను ఫైనల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ‘లూసిఫర్’ రీమేక్‌కు నయనతార నో చెప్పడంతో.. ఆ రోల్ మళ్లీ త్రిషకే వచ్చిందని తెలుస్తోంది.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma