ది బెస్ట్ యానిమల్ డాడ్స్

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి ఒక్కరి రోల్ మోడల్ ‘నాన్నే’. కొడుకైనా, కూతురైనా.. వాళ్ల తొలి హీరో ‘నాన్నే’. చిటికెను వేలు పట్టుకుని నడిపిస్తూ ప్రపంచాన్ని చూపించిన నాన్న.. అనుక్షణం బిడ్డల యోగక్షేమం కోసమే కష్టపడుతుంటాడు. కంటికి రెప్పల్లా తన పిల్లల్ని కాపాడుకుంటాడు. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఇలాంటి బాధ్యత గల తండ్రులున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం. గెయింట్ వాటర్ బగ్ : ఫిమేల్ వాటర్ బగ్స్ గుడ్లను పెడతాయి. కానీ ఆ గుడ్లను ఓ జిగురు […]

Update: 2020-06-20 08:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి ఒక్కరి రోల్ మోడల్ ‘నాన్నే’. కొడుకైనా, కూతురైనా.. వాళ్ల తొలి హీరో ‘నాన్నే’. చిటికెను వేలు పట్టుకుని నడిపిస్తూ ప్రపంచాన్ని చూపించిన నాన్న.. అనుక్షణం బిడ్డల యోగక్షేమం కోసమే కష్టపడుతుంటాడు. కంటికి రెప్పల్లా తన పిల్లల్ని కాపాడుకుంటాడు. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఇలాంటి బాధ్యత గల తండ్రులున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం.

గెయింట్ వాటర్ బగ్ : ఫిమేల్ వాటర్ బగ్స్ గుడ్లను పెడతాయి. కానీ ఆ గుడ్లను ఓ జిగురు లాంటి పదార్థంతో ‘మేల్ వాటర్ బగ్’ వీపుపై అతికిస్తాయి. ఇక ఆ ఫిమేల్ వాటర్ బగ్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మేల్ వాటర్ బగ్స్ దాదాపు రెండు వారాల పాటు 150పైగా ఉన్న గుడ్లను బరువనుకోకుండా బాధ్యతగా మోస్తాయి. ఇతర కీటకాలు, ప్రమాదాల నుంచి వాటిని కంటికి రెప్పలా కాపాడతాయి. అందుకే మరి గెయింట్ వాటర్ బగ్స్ గొప్ప ఫాదర్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తోడేళ్లు : ఇవి కూడా బెస్ట్ పేరేంటెల్ ఫాదర్‌కు ఉదాహరణగా నిలుస్తాయి. ఆడ తోడేళ్లు పిల్లల్ని కనడంతోనే కొన్ని వారాల పాటు గుహల్లోకి వెళ్తాయి. అప్పుడు మగ తోడేళ్లే.. తమకు పుట్టిన తోడేళ్ల బాధ్యతను తీసుకుంటాయి. క్రూర జంతువుల నుంచి వాటిని కాపాడుకుంటూనే.. తమ చిట్టి తోడేళ్లకు వేటాడంలోనూ టెక్నిక్న్ నేర్పిస్తాయి. ఆడ తోడేళ్లకు, పిల్ల తోడేళ్లకు ఆహారాన్ని సేకరించిపెడతాయి. తోడేళ్లలో మరో మంచి లక్షణం ఏంటంటే.. అవి జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటాయి.

ఎంపరర్ పెంగ్విన్ : వీటిని జంతువుల్లోకెల్లా ‘గొప్ప తండ్రు’లుగా చెప్పొచ్చు. గుడ్లు పెట్టడంతోనే ఆడ పెంగ్విన్స్ పని పూర్తవుతుంది. ఆ తర్వాత అవి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఆ గుడ్లను సంరక్షించడంతో పాటు పొదిగే బాధ్యతను మగ పెంగ్విన్స్ తీసుకుంటాయి. మంచు ప్రదేశాల్లో ఉండే పెంగ్విన్స్.. గుడ్లను పొదగడానికి రెండు నెలల సమయం పడుతుంది. ఆ రెండు నెలల కాలంలో మగ పెంగ్విన్స్ ఏమీ తినకుండా, గడ్డకట్టే చలిలో అన్నింటినీ భరించుకుంటూ గుడ్లను పొదగడం విశేషం.

సీ హార్స్ : వీటి గొప్పతనం ఏంటంటే.. మగ సీ హార్స్‌లే పిల్లల్ని కంటాయి. మేల్ సీ హార్స్ కడుపులో ఉండే ప్రత్యేకమైన సంచిలో ఫిమేల్ సీహార్స్ గుడ్లను పెడుతుంది. 45 రోజుల పాటు వాటిని మోసి మగ సీ హార్స్‌లు పిల్లలకు జన్మనిస్తాయి.

రియా పక్షులు, పిగ్మి మార్మోసెట్, ఫ్లెమింగో, కప్ప, ఈము, సాండ్ పైపర్ కూడా పై వాటి తరహాలోనే బెస్ట్ ఫాదర్స్‌గా నిలిచిపోతాయి.

Tags:    

Similar News