తొక్కిసలాటలో 100 మందికి పైగా మృతి.. యోగీ సర్కార్ కీలక నిర్ణయం
యూపీలో తీవ్ర విషాదం నెలకొంది. హత్రాస్ జిల్లాలోని రతిభాన్పూర్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 107 మంది మృతి చెందారు
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో తీవ్ర విషాదం నెలకొంది. హత్రాస్ జిల్లాలోని రతిభాన్పూర్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 107 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ టీమ్‌లు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తొక్కి సలాటలో 100 మందికి పైగా మృతి చెందడంతో యోగీ సర్కార్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే తొక్కి సలాట ఘటనపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి గల కారణాలు, కార్యక్రమ నిర్వహణకు అనుమతి ఉందా లేదా అన్న దానిపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య సహయం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి రూ.50 వేల పరిహారం అనౌన్స్ చేశారు.