జూన్ 4 తర్వాత 'మాఫియా రహితం'గా యూపీ: యోగి ఆదిత్యనాథ్

క్రిమినల్ సిండికేట్‌లపై తమ ప్రభుత్వం కఠిన వైఖరిని అనుసరిస్తుంది.

Update: 2024-05-12 10:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే నెల 4 తర్వాత ఉత్తరప్రదేశ్‌ను 'మాఫియా రహిత ' రాష్ట్రంగా ప్రకటిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆదివారం ప్రకటనలో ఆయన, క్రిమినల్ సిండికేట్‌లపై తమ ప్రభుత్వం కఠిన వైఖరిని అనుసరిస్తుంది. మాఫియాకు చెందిన ఆస్తులను జప్తు చేయడమే కాకుండా, ఆయా ఆస్తులను సమాజంలోని నిరుపేద, అనాథ, మహిళా ఆశ్రమాలు, వికలాంగుల అవసరాలను తీర్చేందుకు, వెనుకబడిన వర్గాలకు పునఃపంపిణీ చేసేందుకు వినియోగిస్తామని యోగి పేర్కొన్నారు. మాఫియాకు చెందిన అక్రమ భూముల్లో ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మిస్తాం. మొదటి దశలో మాఫియాపై ఉక్కుపాదం మోపి, రెండో దశలో వారి ఆస్తులను జప్తు చేస్తాం. దీనికి అవసరమైన ప్రణాళిక కూడా సిద్ధం చేశామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో అశాంతిని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారిపై ఏడు తరాల పాటు ప్రభావం ఉండేలా శిక్షలు ఉంటాయని యోగి ఆదితనాథ్ హెచ్చరించారు.

Tags:    

Similar News