నిన్న జియో నేడు ఎయిర్‌టెల్.. వినియోగదారులకు షాక్ ఇస్తున్న టెలికాం కంపెనీలు
నిన్న జియో టారిఫ్ ప్లాన్ల ధరలు పెంచి వినియోగదారులకు షాక్ ఇవ్వగా.. నేడు ఎయిర్‌టెల్ సైతం అదే బాట పట్టింది.
దిశ, డైనమిక్ బ్యూరో: నిన్న జియో టారిఫ్ ప్లాన్ల ధరలు పెంచి వినియోగదారులకు షాక్ ఇవ్వగా.. నేడు ఎయిర్‌టెల్ సైతం అదే బాట పట్టింది. ఎయిర్‌టెల్ టారిఫ్ ధరలు పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. పెంచిన ధరలు జూలై 3 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. దీంతో జూలై నెల నుంచి ఎయిర్ టెల్ వినియోగదారులపై అధిక భారం పడనుంది. ఇదివరకు 2021 లో టెలికాం సంస్థలు టారిఫ్ రేట్లను 20 పెంచగా.. మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు పెంచాయి. ఈ ధరలు ప్లాన్ల రకం, వ్యాలిడిటీని భట్టి 10-21 శాతం పెంపు ఉండనుందని వెల్లడించింది. పెంపు ధరలు రోజుకు 70 పైసల కంటే తక్కువే ఉంటుందని తెలిపింది. ప్రీపెయిడ్ ప్లాన్లతో పాటు పోస్ట్ పెయిడ్ ధరలను సైతం పెంచింది. ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం రూ. 300 లకు పైగా ఉండాల్సిన అవసరం ఉండటంతోనే ఈ టారిఫ్ ల పెంపు చేపట్టినట్లు తెలిపింది. అంతేగాక పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు వినియోగిస్తామని వెల్లడించింది. ఈ కొత్త టారిఫ్ ధరలు భారతి హెక్సాకామ్ లిమిటెడ్ తో సహా అన్ని సర్కిళ్లకు వర్తిస్తాయని ఎయిర్‌టెల్ సంస్థ తెలిపింది.