అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి

లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి (Annpurna Devi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Update: 2025-03-21 09:54 GMT
అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి (Annpurna Devi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళ వక్షోజాలను తాకితే అది లైంగికవేధింపులు కాదన్న.. ఆ తీర్పు ఆమోదయోగ్యం కాదని అన్నారు. తీర్పుని పరిశీలించాలని.. ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఇలాంటి తీర్పు సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతోందని పేర్కొన్నారు. కేంద్రమంత్రిని సమర్థిస్తూ ఇతర మహిళా నాయకులు కూడా ఈ కేసుని సుప్రీంకోర్టు గమనించాలని కోరారు. మరోవైపు, దేశంలోని మహిళలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం చాలా అసహ్యంగా ఉందని టీఎంసీ ఎంపీ జూన్ మాలియా అన్నారు. జడ్జి వ్యాఖ్యలపై ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ స్పందిస్తూ.. "ఇది చాలా దురదృష్టకరం. జడ్జి చేసిన వ్యాఖ్యలకు నేను చాలా షాక్ అయ్యాను. ఆ వ్యక్తులు చేసిన చర్యను లైంగిక వేధింపుల కిందకు ఎందుకు పరిగణించలేం? ఈ తీర్పు వెనుక ఉన్న తర్కం నాకు అర్థం కాలేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి" అని అన్నారు.

కేసు ఏంటంటే..?

2021 నవంబరులో ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తుండగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వారిని సమీపించారు. బాలికను ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి బైక్‌పై ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో ఆ యువకులు అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాలికను అసభ్యంగా తాకుతూ వేధించారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్న వారు రావడంతో నిందితులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాదితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదైంది. ట్రయల్ కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. అయితే, వారు ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు. కాగా.. ఇటీవలే ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్‌ రామ్‌ మనోహర్‌ నారాయణ్‌ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ వక్షోజాలను తాకినంత మాత్రాన లైంగికవేధింపుల కిందకు రాదంటూ నిందితులకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి సహా పలువురు జడ్జి తీర్పుని తప్పుబట్టారు.

Tags:    

Similar News