Viral news: రాష్ట్రాన్ని శాసించనున్న మహిళలు
బెంగాల్‌లో ఈ నెల 19వ తేదీన లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరగనున్న విషయం అందరికీ సుపరిచితమే.
దశ వెబ్ డెస్క్: బెంగాల్‌లో ఈ నెల 19వ తేదీన లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరగనున్న విషయం అందరికీ సుపరిచితమే. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తీరుపై ఆసక్తి నెలకొంది. బెంగాల్‌లో మహిళా ఓటర్ల సంఖ్య పురుషులతో దాదాపు సమానంగా ఉండడమే దీనికి కారణ. బెంగాల్‌లో 3.85 కోట్ల మంది పురుషులు ఓటు హక్కును కలిగి ఉండగా.. 3.73 కోట్ల మంది మహిళలు ఓటు హక్కును కలిగి ఉన్నారు.
గత ఎన్నికల సమయంతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య 9.8 % పెరిగింది. ఇక 2019 ఎన్నికల్లో 81.35% పురుషుల ఓటింగ్ నమోదు కాగా 81.79% మహిళల ఓటింగ్ నమోదయింది. అంటే గత ఎన్నికల్లో పురుషల ఓటింగ్ శాతంతో పోలిస్తే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువ. దీనితో రానున్న ఎన్నికల్లో వనితల ఓటు ఏ పార్టీకి దక్కుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.