గెలిచినా ఓడినా, మేం భారత జట్టును ప్రేమిస్తున్నాం: రాహుల్ గాంధీ
క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన ఇండియా జట్టుకు యావత్ భారత్ సపోర్ట్ గా నిలుస్తుంది.
దిశ, వెబ్డెస్క్: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన ఇండియా జట్టుకు యావత్ భారత్ సపోర్ట్ గా నిలుస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారత జట్టుగా మద్దతుగా నిలిచాడు. అలాగే ప్రపంచ కప్ జట్టుపై ప్రశంసలు కురిపించారు. భారత్ ఓటమి పై ట్విట్టర్ ద్వారా స్పందించిన రాహుల్.. టీమ్ ఇండియా, మీరు టోర్నమెంట్ అంతటా పటిష్టంగా ఆడారు! గెలిచినా ఓడినా--మేం నిన్ను ఎలాగైనా ప్రేమిస్తాం, తర్వాత దాన్ని గెలుస్తాం అని ట్వీట్ చేశారు.
ప్రపంచకప్ విజయంపై ఆస్ట్రేలియాకు రాహుల్ అభినందనలు తెలిపారు. "అర్హతతో కూడిన ప్రపంచ కప్ విజయం కోసం ఆస్ట్రేలియాకు అభినందనలు," అన్నారాయన. భారత్ బాగా ఆడి హృదయాలను గెలుచుకుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. "ఆటలో మీ ప్రతిభ మరియు క్రీడాకారుల స్ఫూర్తి కనిపించింది. ప్రపంచకప్లో మీ అద్భుతమైన ప్రదర్శనకు ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడుతున్నాడు. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఉత్సాహపరుస్తాము. మీ విజయాలను ఆదరిస్తాము," అని ఆయన రాసుకొచ్చారు.