మాజీ ప్రధాని దేవె గౌడ కీలక వ్యాఖ్యలు.. ఆ బిల్లుపై ప్రధాని లేఖ
మాజీ ప్రధాని, జనత దళ్ సెక్యూలర్ నేత హెచ్‌డీ దేవె గౌడ కీలక వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు: మాజీ ప్రధాని, జనత దళ్ సెక్యూలర్ నేత హెచ్‌డీ దేవె గౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షల పార్టీలకు అండగా ఉంటామని చెప్పారు. కాంగ్రెస్, నితిష్ కుమార్‌లు కలిసి బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలను ఏకం చేసే క్రమంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ షాకిచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా బరిలోకి దిగుతామని సీపీఐ నేతలు ప్రకటించారు.
తమ పార్టీ మనుగడను కాపాడుకునేందుకు కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీపీ కూడా కర్ణాటక ఎన్నికల బరిలో దిగే యోచనలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. మహిళ రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని ప్రధానిని కోరినట్లు దేవె గౌడ ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లోపు ఈ బిల్లును చట్టంగా చేయాలని కోరానని తెలిపారు.