Congress: 'హిండెన్‌బర్గ్ ఆరోపణలపై ప్రధాని, సెబీ, ఆర్థికమంత్రి సమాధానం చెప్పాలి'

దీనిపై సెబీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి వివరణాత్మక సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Update: 2024-08-12 17:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా సెబీ చీఫ్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందించారు. దీనిపై సెబీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి వివరణాత్మక సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 'హిండెన్‌బర్గ్ లేవనెత్తిన పాయింట్ల వారీగా సెబీ, ప్రధాని, ఆర్థిక మంత్రి సమాధానం ఎప్పుడు ఇస్తారు? అందుకోసం మేము ఎదురుచూస్తాము. సెబీ ఛైర్‌పర్సన్ అయిన తర్వాత మాధబి పురి బుచ్ తన ఈ-మెయిల్ ఐడీ నుంచి నగదు కోసం మెసేజ్ పంపారా? అని ప్రశ్నించారు. సెబీ చైర్‌పర్సన్ కాకముందు ఆమె ఆఫ్-షోర్ కంపెనీలలో తన పెట్టుబడుల గురించి వెల్లడించారా? గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ ఆఫ్‌-షోర్‌ కంపెనీల్లో ఆమె కంపెనీలకు పెట్టుబడులు ఉన్నాయని భారత ప్రభుత్వం అనుమానిస్తోందా? అని ఖేరా ఏఎన్‌ఐతో అన్నారు. ఒకవేళ వీటికి సంబంధించి సమాచారం ఉంటే ఆమెను సెబీ ఛైర్‌పర్సన్‌గా ఎందుకు ఎంపిక చేశారు? వారికి సమాచారం లేకపోతే అధికారంలో ఉండి ప్రధాని, ఆర్థిక మంత్రి ఏం చేస్తున్నారు? దీని గురించి వారికి తెలియకపోతే రాజీనామా చేయాలని విమర్శలు చేశారు. 

Tags:    

Similar News