Rajasthan: అక్బర్‌ను 'గొప్ప'గా పేర్కొనే పాఠ్యపుస్తకాలను కాల్చేస్తాం: రాజస్థాన్ మంత్రి

అక్బర్‌ను 'గొప్ప'గా చిత్రీకరించే ఏదైనా పాఠ్యపుస్తకాన్ని కాల్చివేస్తామని మదన్ దిలావర్ అన్నారు.

Update: 2024-09-01 17:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మొఘల్ చక్రవర్తి అక్బర్‌ గురించి రాజస్థాన్ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి మదన్ దిలావర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్బర్‌ను 'గొప్ప'గా చిత్రీకరించే ఏదైనా పాఠ్యపుస్తకాన్ని కాల్చివేస్తామని మదన్ దిలావర్ అన్నారు. అక్బర్ దేశాన్ని ఎన్నో ఏళ్లు దోచుకున్నాడని, రాజస్థాన్‌లోని పాఠ్యపుస్తకాలలో అతనిని 'గొప్ప వ్యక్తి'గా ఎవరూ పేర్కొనలేదని తెలిపారు. 'మేము అన్ని పాఠ్యపుస్తకాలను తనిఖీ చేసాము. అతని ప్రస్తావన లేదు, ఒకవేళ ఉంటే, అప్పుడు పాఠ్యపుస్తకం తగలబడుతుంది' అని ఆయన పేర్కొన్నారు. ఉదయపూర్‌లోని సుఖాడియా విశ్వవిద్యాలయంలోని వివేకానంద ఆడిటోరియంలో 28వ రాష్ట్ర స్థాయి 'భామా షా సమ్మాన్ సమరోహ్' సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి పైవ్యాఖ్యలు చేశారు. అక్బర్‌ను 'రేపిస్ట్' అని సంభోదించిన దిలావర్, 'అతను ఒక దురాక్రమణదారుడు. అతన్ని గొప్పగా పేర్కొనడం మూర్ఖత్వమని అన్నారు. ఇదే సమయంలో రాజ్‌పుత్‌ల రాజ్యం మేవార్ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహారాణా ప్రతాప్‌కు గొప్ప చారిత్రక వ్యక్తిగా ఇవ్వాల్సిన గుర్తింపు ఎన్నడూ రాలేదని దిలావర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రారంభం జనవరిలో సైతం మదన్ దిలావర్ అక్బర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్బర్‌ను రేపిస్ట్ అంటూ, పాఠ్యపుస్తకాల్లో అక్బర్‌ను గొప్ప వ్యక్తిగా చిత్రీకరించడాన్ని తొలగించాలన్నారు. 

Tags:    

Similar News