Beef Ban : కాంగ్రెస్ లేఖ రాస్తే.. బీఫ్ బ్యాన్ చేస్తా : అసోం సీఎం హిమంత

దిశ, నేషనల్ బ్యూరో : గోమాంసంపై నిషేధం(Beef Ban) విధించే అంశంపై అసోం(Assam) సీఎం హిమంత బిస్వ శర్మ(CM Himanta) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-01 12:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో : గోమాంసంపై నిషేధం(Beef Ban) విధించే అంశంపై అసోం(Assam) సీఎం హిమంత బిస్వ శర్మ(CM Himanta) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా సమగురి నియోజకవర్గంలోని ముస్లిం ఏరియాల్లో బీఫ్‌ను బీజేపీ పంపిణీ చేసిందంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. బీఫ్‌పై బ్యాన్ విధించాలని కోరుతూ కాంగ్రెస్(Congress) పార్టీ లేఖ రాస్తే.. తాను ఆ దిశగా ప్రభుత్వపరమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమేనని సీఎం హిమంత ప్రకటించారు.

‘‘బీఫ్ బ్యాన్ అంశంపై నేను అసోం కాంగ్రెస్ చీఫ్ బూపేన్ కుమార్ బోరాకు లెటర్ రాస్తాను. కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుసేన్ బీజేపీపై చేస్తున్న ఆరోపణలతో ఏకీభవిస్తారో లేదో ఆయనను అడిగి తెలుసుకుంటాను. తప్పకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఫ్‌ను బ్యాన్ చేస్తా. అందరూ బీఫ్ తినడం ఆపేస్తే సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుంది’’ అని హిమంత పేర్కొన్నారు.

Tags:    

Similar News