Tejashwi Yadav : ఎస్సీ, ఎస్టీలపై ప్రేమ ఉంటే ఆర్డినెన్స్ తీసుకురండి.. బీజేపీకి తేజస్వి సవాల్

దిశ, నేషనల్ బ్యూరో : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమీలేయర్‌ను వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టు చేసిన సూచనలపై ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-14 14:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమీలేయర్‌ను వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టు చేసిన సూచనలపై ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు బీజేపీ అనుకూలంగా ఉంటే.. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ అంటే ‘బడ్కా ఝూటా పార్టీ’ అని ఆయన కామెంట్ చేశారు. ‘‘65 శాతం రిజర్వేషన్లకు, 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.

ఆ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని మేం డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ మాత్రం ఆయా రిజర్వేషన్లు రద్దయ్యేలా కోర్టుకు వాళ్ల మనుషులను పంపుతోంది. మేం రిజర్వేషన్ల రక్షణకు సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. దీనిపై వీధి పోరాటం కూడా మొదలుపెడతాం’’ అని తేజస్వియాదవ్ వ్యాఖ్యానించారు. దేశంలో గందరగోళాన్ని, ద్వేషాన్ని వ్యాపింపజేయడాన్నే బీజేపీ పనిగా పెట్టుకుందని.. దానికి మరో పనిలేదని విమర్శించారు. 

Tags:    

Similar News