ఇందిరా ఆస్తి పోవద్దనే.. ఆ పన్నును రాజీవ్ రద్దు చేశారు : ప్రధాని మోడీ

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మరణానంతరం ఆమె ఆస్తి ప్రభుత్వానికి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే వారసత్వపు పన్నును రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసిందని ప్రధాని మోడీ సంచలన ఆరోపణ చేశారు.

Update: 2024-04-25 17:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మరణానంతరం ఆమె ఆస్తి ప్రభుత్వానికి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే వారసత్వపు పన్నును రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసిందని ప్రధాని మోడీ సంచలన ఆరోపణ చేశారు. ‘‘1985లోనే వారసత్వపు పన్ను, చరాస్తులు, స్థిరాస్తులపై లెవీని రాజీవ్ గాంధీ రద్దు చేశారు. ఆ చట్టాన్ని మళ్లీ తెస్తే అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతారు’’ అని ఆయన చెప్పారు. వారసత్వపు పన్ను చట్టాన్ని మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందని ప్రధాని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడారు. అలాంటి చట్టాలను తాము అస్సలు తిరిగి ప్రవేశపెట్టబోమని తేల్చి చెప్పారు. ముస్లిం వర్గాల ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తోందన్నారు.

Tags:    

Similar News