బెంగాల్ లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు
పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. మొత్తం 42 నియోజకవర్గస్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది.
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. మొత్తం 42 నియోజకవర్గస్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. బీజేపీ 21 స్థానాల్లో, టీఎంసీ 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమైంది. టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, మహువా మొయిత్రీ, సుదీప్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీ, శతాబ్ది రాయ్ ముందజలో ఉన్నారు. బీజేపీ నుంచి బరిలో నిలిచిన కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ముందంజలో ఉన్నారు. బీజేపీ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్, ఎంపీ సౌమిత్రాఖాన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ముర్షీదాబాద్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం ఆధిక్యంలో ఉన్నారు. కాగా, బెర్హంపూర్ లో టీఎంసీ నుంచి బరిలో దిగిన మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ వెనుకంజలో ఉన్నారు.