దేశంలో అస్థిరతను సృష్టించేదుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశంలో అస్థిరత వాతావరణాన్ని సృష్టించడానికి అనేక భారత వ్యతిరేక శక్తులు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశంలో అస్థిరత వాతావరణాన్ని సృష్టించడానికి అనేక భారత వ్యతిరేక శక్తులు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్ గడ్డపై నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రయత్నాలు నిరంతరం జరుగతున్నాయని చెప్పారు. సోమవారం జమ్మూలో పర్యటించిన మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వం తీవ్రవాదంపై సమర్థవంతమైన చర్య తీసుకోలేదన్న ఆయన.. కానీ పీఎం మోడీ నాయకత్వంలోని తమ ప్రభుత్వం తీవ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పారు.
మనదేశంలోనే కాదు ప్రపంచానికి ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అంటే ఏమిటో తెలిసిందని అన్నారు. దేశంలో అవినీతిని పూర్తిస్థాయిలో నిర్మూలించామని తాము చెప్పుకోవడం లేదని, ఆ మాటకొస్తే అది ఎవరి వల్ల సాధ్యం కాదని అన్నారు. ప్రసంగాలు చేయడం ద్వారా అవినీతి తగ్గదనన్న ఆయన.. వ్యవస్థలో మార్పులు చేయడం ద్వారా మాత్రమే అవినీతిని అంతమొందించవచ్చు అని అన్నారు. పీఎం మోడీ ఈ దిశగానే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.