వయనాడ్ లాండ్‌స్లైడ్.. 481 మందిని ప్రాణాలతో కాపాడిన బలగాలు

సోమవారం అర్ధరాత్రి వయనాడ్ లోని మెప్పాడిలో ప్రకృతి విలయతాండవం సృష్టించింది.

Update: 2024-07-31 04:25 GMT

దిశ, వెబ్ డెస్క్: సోమవారం అర్ధరాత్రి వయనాడ్ లోని మెప్పాడిలో ప్రకృతి విలయతాండవం సృష్టించింది. రాత్రి 4 గంటలకు వరుసగా కొండచరియలు విరిగిపడటం, ఒక్కసారిగా వరద దూసుకురావడంతో చురుల్‌మలా అనే గ్రామం పూర్తిగా ద్వంసం అయింది. దీంతో దాదాపు నాలుగు వందల కుటుంబాలు కొండచరియలు, శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 150 మృతదేహాలను కనుగొన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన చోటు వెళ్లే ప్రధాన రోడ్డు మొత్తం కొట్టుకుపోవడం, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది. అయినప్పటిని ఎన్డీఆర్ఎఫ్.. భారత సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

భారీ కొండలు, బుదను తొలగిస్తున్న కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. కాగా ఇళ్లలో చిక్కుకుని పోయిన వారిని సహాయక బృందాలు రక్షించాయి. ఇప్పటి వరకు 481 మందిని సురక్షితంగా రక్షించినట్లు తెలుస్తుంది. అలాగే సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు దాదాపు 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న దాదాపు 600 మంది వలస కూలీల ఆచూకీ లభ్యం కాకపోవడం మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తుందని అధికారులు తెలిపారు. సోమవారం ఆదివారం, సోమవారం రెండు రోజుల్లో 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News